Thursday, November 21, 2024

రిషి సునాక్‌, బిల్‌ గేట్స్‌తో చాట్‌జీపీటీ ఇంటర్వ్యూ..

ఏఐ చాట్‌బాట్‌ చాట్‌జీపీటీపై టెక్‌ ప్రపంచంలో గత రెండు నెలలుగా విస్తృత చర్చ జరుగు తోంది. మ్యూజిక్‌ కంపోజ్‌, పొయిట్రీ, వ్యాసాల రచన, హోంవర్క్‌ సమస్యలకు పరిష్కారాలకు ప్రతి ఒక్కరూ వైరల్‌ ఏఐ చాట్‌బాట్‌ను ఉపయోగిస్తున్నారు. తాజాగా చాట్‌జీపీటీ బ్రిటన్‌ ప్రధాని రిషీ సునాక్‌, మైక్రోసాప్ట్‌ సహ వ్యవస్ధాపకులు బిల్‌ గేట్స్‌ను ఇంటర్వ్యూ చేసింది. ఏఐ చాట్‌బాట్‌ తమ ముందుంచిన ప్రశ్నలకు వీరిద్దరూ సమాధానాలు ఇచ్చారు. ఈ వీడియోను బిల్‌ గేట్స్‌ లింక్డిన్‌లో షేర్‌ చేశారు. తనతో పాటు రిషీ సునాక్‌ను ఏఐ చాట్‌బాట్‌ ఇంటర్వ్యూ చేసిందని ఈ పోస్ట్‌లో గేట్స్‌ రాసుకొచ్చారు. తాను, గేట్స్‌ లండన్‌ ఇంపీరియల్‌ కాలేజ్‌లో బ్రిటన్‌ టాప్‌ ఇన్నోవేటర్స్‌తో సమావేశమయ్యామని బ్రిటన్‌ ప్రధాని రిషీ సునాక్‌ చెబుతుండటంతో వీడియో మొదలైంది. ఆపై చర్చలోకి బిల్‌ గేట్స్‌ ఎంట్రీ ఇవ్వడంతో పాటు తమను ఏఐ ఇంటర్వ్యూ చేస్తోందని చెబుతారు.

రాబోయే పదేండ్లలో ప్రపంచ ఆర్ధిక వ్యవస్ధ, జాబ్‌ మార్కెట్‌పై ఏఐ ప్రభావం గురించి తొలి ప్రశ్న ఎదురవగా విద్యా, వైద్య రంగాల్లో శ్రామికుల కొరత తీవ్రంగా ఉండటంతో మనం మరింత సమర్ధంతగా వ్యవహరిం చాలని, ఏఐ ఈ దిశగా మరింత రాటుదేలుతుందని గేట్స్‌ ఆశాభావం వ్యక్తం చేశారు. యువ టెకీలకు ఇచ్చే సందేశం ఏంటని అడగ్గా బిల్‌ గేట్స్‌, రిషీ సునాక్‌లు బదులిస్తూ తాము అన్ని విషయాలను తేలికగా తీసుకుంటామని, ప్రస్తుతంలోనే బతుకుతూ ఆయా క్షణాలను ఆస్వాదిస్తామని చెప్పారు. తాను వీకెండ్‌ కల్చర్‌కు దూరమని, పని కోసం ఎంత కష్టమైనా చేస్తానని గేట్స్‌ తెలిపారు. తాను కూడా గేట్స్‌ వాదనతో ఏకీభవిస్తానని, వలసవాద కుటుంబం నుంచి వచ్చిన తాను తన పనితీరుతో ఎదిగేందుకు ఎప్పుడూ ప్రయత్నిస్తానని సునాక్‌ పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement