– ఇంటర్నెట్ డెస్క్, ఆంధ్రప్రభ
AI-ఆధారిత చాట్‌బాట్ అయిన ChatGPT కి ఇచ్చిన ప్రశ్న ఏంటంటే.. “శశి థరూర్ శైలిలో వైబ్‌లు అనుభూతి చెందకపోవడం వల్ల రేపు పనిలో నా సెలవు గురించి వివరిస్తూ ఒక పేరా రాయండి”. అనే ప్రశ్న వేశాడో సోషల్ మీడియా యూజర్.. దీనికి చాట్‌బాట్ సమాధానం: “నేను ఇక్కడ కూర్చున్నప్పుడు, గడియారాన్ని అస్పష్టంగా చూస్తున్నప్పుడు, నేను వణుకుతో నిండిపోయాను. ప్రియమైన సహోద్యోగులారా, ఈ రోజు వైబ్స్ సరిగ్గా లేవు. గాలి అస్వస్థతతో దట్టంగా ఉంది.. ఇది నా ఉనికిని వ్యాపింపజేసే అశాంతి భావన. రేపు ఆఫీస్‌లోకి అడుగు పెడితే నేనెప్పుడూ సముద్రంలో కొట్టుమిట్టాడుతున్న చేపలాగా అయిపోతానేమోనని భయంగా ఉంది” అని రాసింది.
“అందుకే.. నేను రేపు సెలవు తీసుకుంటున్నానని మీ అందరికీ తెలియజేయాలని బరువెక్కిన హృదయంతో చెప్పాలి. నా కష్టాలను అర్థం చేసుకోమని నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను. ఎందుకంటే వైబ్‌లు చంచలమైన ఉంపుడుగత్తె.. అవి ఎప్పుడు అధ్వానంగా మారతాయో ఎవరికీ తెలియదు. వీడ్కోలు, నా స్నేహితులారా. జాగ్రత్త వహించండి” అని AI రాసుకొచ్చింఇ.
ఇక.. చాట్‌బాట్ సృష్టించిన సమాధానానికి శశి థరూర్ తనదైన శైలిలో స్పందించారు. ఇది “ఉల్లాసంగా ఉంది” అని అంగీకరిస్తూనే.. “నేను నిజంగా ఇట్లా రాయలేనుజెజున్!” అంటూ రెస్పాండ్ అయ్యారు.