ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్(ఏఐ0 విషయంలో టెక్ కంపెనీల మధ్య పోటీ ప్రారంభమైంది. మైక్రోసాఫ్ట్ ఏఐ అధారిత చాట్ జీపీటీను తీసుకు వచ్చింది. దీనికి విపరీతమైన ఆదరణ లభిస్తుండటంతో మిగిలిన టెక్ కంపెనీలు ఇదే తరహా సేవలు అందించేందుకు తమ వంతు ప్రయత్నాలను ముమ్మరం చేశాయి. గూగుల్ మాతృ సంస్థ అల్ఫాబెట్ బార్డ్ పేరుతో చాట్ జీపీటీ తరహా ఏఐ టూల్‌ను అభివృద్ధి చేస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించింది. ఇప్పుడు ఇదే బాటలో ఫేస్‌బుక్ మాతృ సంస్థ మెటా ఇందు కోసం కంపెనీలో ఓ ఉన్నత స్థాయి ప్రొడక్ట్ గ్రూప్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు మెటా సీఈఓ మార్గ్ జుకర్ బర్గ్ ప్రకటించారు. ఇందులో భాగంగా తొలుత వాట్సాప్, ఇన్‌స్టాలో చాట్ జీపీటీ తరహా సేవలను అందుబాటులోకి తీసుకు వస్తామని తెలిపారు.
కృత్రి మేథకు సంబంధించిన ఓ టీమ్‌ను ఏర్పాటు చేశామని, దీనికి మెటా చీఫ్ ప్రొడక్ట్ ఆఫీసర్ క్రిస్ కాక్స్ నేతృత్వం వహిస్తారని జుకర్ బర్గ్ తెలిపారు. ఈ టీమ్ భవిష్యత్‌ఓ వివిధ రూపాల్లో ప్రజలకు సంబంధించి అన్ని అవసరాలను తీర్చే విధంగా ఏఐ పర్సనాస్‌ను రూపొందించనుందని పేర్కొన్నారు. ఇందు కోసం కొంత ఫౌండేషన్ వర్క్ అవసరమని చెప్పారు. ప్రస్తుతానికి వాట్సాప్, ఇన్‌స్టాలో ఇమేజెస్, టెక్ట్స్, వీడియాెె, బహుళ మోడల్ రూపంలో అందించగలిగే అవకాశాలను పరిశీలిస్తున్నామని ఆయన తెలిపారు.
ఆర్ధిక మాంద్యం పేరుతో భారీ స్థాయిలో ఉద్యోగులను తొలగిస్తున్న కంపెనీలు, మరో వైపు ఏఐ సాంకేతికతపై ప్రధానంగా దృష్టి పెట్టాయి. ఇందుకు భారీగా పెట్టబడులు పెడుతున్నాయి. ఏఐ తరహా సేవలు అందించేందుకు టెక్ కంపెనీలు పోటీ పడుతున్నాయి. స్నాప్‌చాట్ కూడా తమ యాప్‌లో చాట్ జీపీటీ తరహా సేవలు అందించనున్నట్లు ప్రకటించింది. గత వారం లామా పేరుతోఓ కొత్త లాంగ్వేజ్ మోడల్‌ను తీసుకు వచ్చిన మెటా, దీనిపై పరిశోధనా బృందాన్ని ఏర్పాటు చేసింది.