Friday, November 22, 2024

ఆండ్రాయిడ్ యూజ‌ర్ల‌కు గుడ్ న్యూస్.. ప్లే స్టోర్ లో చాట్ జీపీటీ..

ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ రూప‌క‌ల్ప‌న‌తో చాట్ బోట్ అతి త‌క్కుక కాలంలోనే ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయ్యింది. ఒపేన్ ఏఐ కంపెనీ అబివృద్ధి చేసిన ఈ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ఏకంగా 100 మిలియన్ల యూజర్లతో ఇంటర్నెట్ ను షేక్ చేసింది. అద్భుతమైన సామర్థ్యాలతో, అన్ని విషయాలపై లోతైన అవగాహనతో ఇండియాలో కూడా పాపులర్ అవుతోంది. మొదట వెబ్ అప్లికేషన్ గా మాత్రమే ప‌రిచ‌యమైన ఈ ఏఐ టూల్.. తాజాగా ఆండ్రాయిడ్ అప్లికేషన్ రూపంలోనూ అందుబాటులోకి వచ్చింది.

ఆండ్రాయిడ్ చాట్‌జీపీటీ యాప్‌ Android 6, అంతకంటే ఎక్కువ వెర్షన్లపై రన్ అవుతున్న ఫోన్లకు ఇది సపోర్ట్ చేస్తుంది. జులై 21న రిలీజ్ అయిన ఈ యాప్ జులై 26న మ‌రింత అప్‌డేట్ చేశారు. కాగా, గ‌త (జులై) నెలాఖరులో రిలీజ్ అయిన ఈ ఓపెన్ ఏఐ గూగుల్ ప్లే స్టోర్‌లో ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

కాగా, ఈ ఏడాది మే లోనే చాట్ జీపీటీ ఐఫోన్ యూజర్లకు కూడా అందుబాటులోకి వచ్చింది. ఇప్పుడు గూగుల్ ప్లే స్టోర్ ద్వారా ఆండ్రాయిడ్ యూజర్లకు కూడా అందుబాటులోకి వచ్చింది. వెబ్ వెర్షన్‌లో క్వశ్చన్లు అడిగినట్లే ఈ ఆండ్రాయిడ్ యాప్‌లో కూడా వినియోగదారులు క్వారీస్ అడగవచ్చు. ఏ టాపిక్ గురించి అయినా అడిగి రెస్పాన్స్‌లు పొందవచ్చు.

Advertisement

తాజా వార్తలు

Advertisement