Wednesday, December 18, 2024

Railway Terminal | ప్రారంభానికి రెడీగా చర్లపల్లి టెర్మినల్

హైదరాబాద్ మహానగరంలో మరో మణిహారం చేరేందుకు ముహూర్తం ఖరారైంది. భాగ్యనగరంలో మరో రైల్వే స్టేషన్ అందుబాటులోకి రానుంది. చర్లపల్లి రైల్వే టెర్మినల్ ఈ నెల 28న (డిసెంబర్) ప్రారంభం కానుంది. చర్లపల్లి రైల్వేస్టేషన్‌ను కేంద్రమంత్రులు అశ్విని వైష్ణవ్, కిషన్ రెడ్డి ప్రారంభించనున్నారు.

హైదరాబాద్, సికింద్రాబాద్‌లోని రైల్వే స్టేషన్‌లపై ఒత్తిడి తగ్గించేందుకు అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చర్లపల్లి రైల్వే టెర్మినల్‌ను దాదాపు రూ.430 కోట్లతో అత్యాధునిక సౌకర్యాలతో అభివృద్ధి చేశారు. చర్లపల్లి రైల్వే టెర్మినల్ పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే సుదూర ప్రాంతాలకు వెళ్లే అనేక రైళ్లు ఇక్కడి నుంచి నడుస్తాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement