Sunday, November 17, 2024

కొవిడ్‌ సర్టిఫికేట్‌ లేకున్నా చార్‌ధామ్‌ యాత్ర.. మే 2 నుంచి ప్రారంభం

చార్‌ధామ్‌ యాత్రలో భాగంగా.. ఉత్తరాఖండ్‌ ప్రభుత్వం భక్తులకు ఊరట ఇచ్చింది. మే 3 నుంచి చార్‌ధామ్‌ యాత్ర ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఛార్‌ధామ్‌ యాత్ర చేయాలనుకునే భక్తులు కొవిడ్‌ పరీక్ష, వ్యాక్సినేషన్‌ సర్టిఫికేట్‌ అవసరం లేదని తెలిపింది. యాత్రకు ముందు భక్తులందరూ.. విధిగా రాష్ట్ర పర్యాటక పోర్టల్‌లో తమ వివరాలు నమోదు చేసుకోవాలని సూచించింది. యాత్ర తేదీ సమీపిస్తుండటం, ఆయా రాష్ట్రాల నుంచి వచ్చే యాత్రికులకు కొవిడ్‌ నిబంధనల విషయంలో గందరగోళం నెలకొనడంతో ఈ సమస్యను పరిష్కరించేందుకు ముఖ్యమంత్రి పుష్కర్‌ సింగ్‌ ధామీ సూచనల మేరకు ప్రధాన కార్యదర్శి ఎస్‌ఎస్‌ సంధు అధికారులతో సమావేశం అయ్యారు.

క్షేత్ర స్థాయిలో పరిస్థితులను అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని ఆ రాష్ట్ర సీఎస్‌ సంధు ఆదేశించారు. ఇప్పటి వరకు దాదాపు 1.5 లక్షల మంది ఈ యాత్ర కోసం రిజిస్ట్రేషన్‌ పోర్టల్‌లో నమోదు చేసుకున్నారు. దేశ వ్యాప్తంగా ఆయా ప్రాంతాల్లో కొవిడ్‌ కేసులు మళ్లి పెరుగుతున్న నేపథ్యంలో.. భక్తులకు నెగిటివ్‌ ఆర్‌టీపీసీఆర్‌ రిపోర్టు తప్పనిసరి అని తొలుత వార్తలు వచ్చాయి. గతంలో భక్తుల సంఖ్యపై కూడా పరిమితులు విధించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement