పంజాబ్ అసెంబ్లి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమి తరువాత.. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చరణ్ జీత్ సింగ్ చన్నీ.. శుక్రవారం తన పదవికి రాజీనామా చేశారు. ఉదయం రాజ్‌భవన్‌కు వెళ్లిన ఆయన.. గవర్నర్ బన్వరీలాల్ పురోహిత్‌కు రాజీనామా పత్రాన్ని అందజేశారు. తదుపరి ప్రభుతం ఏర్పాటయ్యేంత వరకు అపద్ధర్మ ప్రభుతాన్ని నడిపించాలని గవర్నర్ ఈ సందర్భంగా చన్నీని కోరారు. గవర్నర్‌తో సమావేశం అనంతరం.. ఈ సందర్భంగా చన్నీ మాట్లాడుతూ.. ఉత్తర్‌ప్రదేశ్ ఓటర్ల తీర్పును అంగీకరిస్తున్నామన్నారు. తన హయాంలో చివరి 111 రోజుల్లో ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను కొత్తగా ఏర్పడబోయే ప్రభుత్వం అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. అభివృద్ధి ప్రాజెక్టులను నిలిపివేయవద్దని, ప్రజల కోసం కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ పాటుపడుతుందని, ఈ విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదన్నారు. గెలిచినా.. ఓడినా.. తాము ప్రజల వెంటే ఉంటామని స్పష్టం చేశారు.
మణిపూర్ సీఎం బీరెన్ సింగ్ రిజైన్..
మణిపూర్ సీఎం బీరెన్ సింగ్ శుక్రవారం తన పదవికి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను గవర్నర్‌కు అందజేశారు. తదుపరి ప్రభుతం ఏర్పాటయ్యే వరకు అపద్ధర్మ సీఎంగా ఉండాలని గవర్నర్ కోరినట్టు బీరెన్ తెలిపారు. మార్చి 19 వరకు అసెంబ్లి కాలం ఉందని, ఆ తరువాతే కొత్త సీఎం ప్రమాణ స్వీకారం ఉంటుందని భావిస్తున్నట్టు బీరెన్ తెలిపారు. మణిపూర్ పొత్తులపై బీరెన్ సింగ్ కీలక ప్రకటన చేశారు. ఎన్‌పీపీ (నేషనల్ పీపుల్స్ పార్టీ)తో తాము పొత్తు పెట్టుకోవడం లేదన్నారు. ఎన్‌పీఎఫ్ (నాగా పీపుల్స్ ఫ్రంట్)కు సంబంధించిన నేతలు, ఇతర సతంత్రులు ప్రభుత్వ ఏర్పాటుపై తమను సంప్రదించారన్నారు. కేంద్ర నాయకత్వంతో సంప్రదింపులు జరిపిన తరువాతే.. తుది నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..