Tuesday, November 26, 2024

Kharge: ఆయ‌న‌కు కూట‌మిలు మార‌డం ఒక ఆట – ఖ‌ర్గే…

బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ రాజీనామాపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఘాటుగా స్పందించారు. కలబురిగిలో ఆయన ఆదివారం మాట్లాడుతూ.. దేశంలో ఆయా రామ్, గయా రామ్ లాంటి రాజకీయ నేతలు ఎక్కువైపోయారని పరోక్షంగా నితీశ్‌ని ఉద్దేశించి అన్నారు. కొంద‌రికి పార్టీలు , కూట‌మి నుంచి జంప్ చేయ‌డాలు ఒక ఆట అని ప‌రుషంగా మాట్లాడారు.

“మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్, డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్‌ నాతో నితీశ్ వెళ్లిపోతున్నారని చెప్పారు. ఈ విషయం మాకు ముందే తెలుసు. ఇండియా కూటమికి అంతరాయం కలగకుండా ఉండేందుకు ఈ విషయాన్ని బయటకి చెప్పలేదు. అలా చెబితే ప్రత్యర్థులు ప్రజల్లోకి తప్పుడు సంకేతాన్ని పంపుతారు’ అని ఖర్గే అన్నారు.

- Advertisement -

కాగా, జనతాదళ్ (యునైటెడ్) జాతీయ అధ్యక్షుడు, సీఎం నితీశ్ కుమార్ రాజ్‌భవన్‌‌లో గవర్నర్ రాజేంద్ర అర్లేకర్‌కు తన రాజీనామాను అందజేశారు. ఈ నేప‌థ్యంలో బీజేపీ శాసనసభాపక్ష సమావేశం పట్నాలోని పార్టీ కార్యాలయంలో జరుగుతోంది. జేడీయూ.. బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని భావిస్తోంది. ఈ విష‌యంలో బిజెపి ఎమ్మెల్యేల‌తో చ‌ర్చించేందుకు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా పాట్నా చేరుకున్నారు.
ప్రస్తుత బలాబలాలివి..
ఆర్జేడీ – 79
బీజేపీ – 78
జెడియు నితీష్ – 45
కాంగ్రెస్ – 19
క‌మ్యూనిస్ట్ ఎం ఎల్ – 12
హిందుస్తానీ అవామ్ మోర్చా (సెక్యులర్) – 4
సిపీఐ – 2
సీపీఐ (ఎం) – 2
స్వతంత్ర ఎమ్మెల్యే – 1

Advertisement

తాజా వార్తలు

Advertisement