ప్రపంచంలోనే అత్యుత్తమ విమానాశ్రయంగా మళ్లి సింగపూర్‌లోని చాంగీ ఎయిర్‌పోర్ట్ నిలిచింది. నిన్నటిదాకా ప్రధమ స్థానంలో ఉన్న ఖతర్‌లో దోహాలోని హమద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌ను రెండవ స్థానానికి పడిపోయింది. స్కైట్రాక్స్ వరల్డ్ ఎయిర్‌పోర్ట్ అవార్డ్స్ 2023 పురస్కారాలను ప్రకటించిన నేపథ్యంలో మూడవ స్థానంలో జపాన్‌లోని టోక్యో హెనెడా ఎయిర్‌పోర్ట్ నిలిచింది. రెండేళ్ల పాటు మహమ్మారి ప్రయాణ పరిమితుల కారణంగా ఖతర్‌కు దీర్ఘకాలంగా ఉన్న అత్యుత్తమ కిరీటాన్ని కోల్పోవాల్సి వచ్చింది. అయితే ఆసక్తికర విషయం ఏమంటే.. టాప్ 10లో అమెరికా విమానాశ్రయాలేవీ ర్యాంక్‌ను పొందలేకపోయాయి. పారిస్ చార్లెస్ డి గల్లె యూరప్‌లో అత్యుత్తమ ఎయిర్‌పోర్ట్.
ఒక స్థానం ఎగబాకి ఐదవ స్థానానికి చేరుకుంది. అమెరికాలోని సీటెల్ టాకోమా అంతర్జాతీయ విమానాశ్రయం ఉత్తర అమెరికా విమానాశ్రయంలో అత్యధిక ర్యాంక్‌ని పొందింది. గత ఏడాది 27 వ ర్యాంక్‌లో ఉన్న ఈ ఎయిర్‌పోర్ట్, ప్రస్తుతం తాజా ర్యాంకింగ్‌లో 18 వస్థానంలో నిలిచింది. చాంగి ఎయిర్‌పోర్ట్ గ్రూప్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ టీ సియో హియాంగ్ మాట్లాడుతూ, చాంగి విమానాశ్రయం పన్నెండో సారి ప్రపంచంలోనే అత్యుత్తమ విమానాశ్రయంగా గుర్తింపు పొందిందన్నారు. గత రెండేళ్లుగా కొవిడ్-19 సవాళ్లతో పోరాడేందుకు దృఢంగా నిలబడిని మా విమానాశ్రయం సంఘానికి ఈ గుర్తింపు గొప్ప ప్రోత్సాహం అన్నారు. స్కైట్రాక్స్ వరల్డ్ ఎయిర్‌పోర్ట్ అవార్డులు కస్టమర్ సంతృప్తి సర్వే ద్వారా నిర్ణయించబడతాయి.