రాష్ట్రంలో వర్షాలు, వరదల నేపథ్యంలో డిగ్రీ ఆన్‌లైన్ సర్వీసెస్ తెలంగాణ (దోస్త్) స్పెషల్ డ్రైవ్ అడ్మిషన్ల షెడ్యూల్‌లో అధికారులు మార్పులు చేశారు. ఈ మేరకు (సోమవారం) సవరించిన షెడ్యూల్‌ను ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్.లింబాద్రి, కళాశాల విద్యాశాఖ కమిషనర్ శ్రీదేవసేన విడుదల చేశారు.
అర్హులైన విద్యార్థులు ఈ నెల 11వ తేదీ వరకు రూ.400 చెల్లించి నమోదు చేసుకోవచ్చు అని తెలిపారు. 11వ తేదీ వరకు వెబ్ ఆప్షన్లను ఎంచుకోవచ్చు. ఈ నెల 10న సర్టిఫికెట్ వెరిఫికేషన్, ఈ నెల 12న సీట్ల కేటాయింపు జరగనుంది. సీట్లు పొందిన వారు ఈ నెల 16 వరకు సెల్ఫ్ రిపోర్టింగ్‌తోపాటు సీట్లు పొందిన కాలేజీల్లో నేరుగా రిపోర్టు చేయాల్సి ఉంటుంది.