Wednesday, November 20, 2024

ఇంటర్‌ సెకండియర్‌ సిలబస్‌లో మార్పులు.. ఈ విద్యాసంవత్సరం నుంచే అమలు..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం ఇంగ్లీష్‌ సబ్జెక్టు సిలబస్‌లో మార్పులు చేశారు. మార్పు చేసిన కొత్త ఇంగ్లీష్‌ పుస్తకాలను విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి గురువారం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఇంటర్‌ బోర్డు కార్యదర్శి సయ్యద్‌ ఉమర్‌ జలీల్‌ మాట్లాడుతూ ఇటీవల ప్రకటించిన ఫలితాల్లో ఫెయిలైన విద్యార్థులకు పాత సిలబస్‌ ప్రకారమే పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. ఈ ఏడాది నుంచి కొత్త సిలబస్‌తో ఇంగ్లీష్‌ పుస్తకాలను ముద్రించామని తెలిపారు. ఈ కొత్త పుస్తకాలు మార్కెట్‌లోకి త్వరలోనే అందుబాటులోకి వస్తాయని చెప్పారు. మార్చిన సిలబస్‌ ఈ 2022-23 విద్యా సంవత్సరం నుంచి అందుబాటులోకి రానున్నట్లు తెలిపారు.

మార్చి 2023, మే 2023లో నిర్వహించే పరీక్షల్లో పాల్గొనే విద్యార్థులకు కొత్త సిలబస్‌ ప్రకారం పరీక్ష పేపర్‌ ఉంటుందన్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రతి ఐదేళ్లకోసారి సిలబస్‌లో మార్పులు చేయాలని గతంలో తీసుకున్న నిర్ణయం ప్రకారమే ఈ మార్పులు చేసినట్లు తెలుస్తోంది. 2019-20 విద్యా సంవత్సరంలోనూ ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌కు సంబంధించిన హ్యుమనిటీస్‌ సబ్జెక్టు సిలబస్‌ను ఇంటర్‌ బోర్డు మార్చిన విషయం తెలిసిందే.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement