Thursday, December 12, 2024

TG | విగ్రహం మార్పు.. కాంగ్రెస్ మూర్ఖత్వం : కేసీఆర్‌

తెలంగాణ తల్లి రూపం మార్చడంపై బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ స్పందించారు. ‘కాంగ్రెస్ ప్రభుత్వానిది మూర్ఖపు చర్య.. ప్రభుత్వాలు చేయాల్సిన పనులు ఇవేనా.?’ అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో సభలో అనుసరించాల్సిన వ్యూహంపై ఆయన ఆదివారం ఎర్రవెల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ ప్రభుత్వం తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చడంపై కేసీఆర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వాలు మార్పులు చేసుకుంటూ పోతే ఎలా అని నిలదీశారు. ప్రభుత్వం సమస్యల పరిష్కారంపై దృష్టి సారించాలన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సమావేశాలకు హాజరవ్వాలని.. అంశాల వారీగా ప్రభుత్వాన్ని నిలదీయాలని దిశానిర్దేశం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement