Saturday, November 23, 2024

ఇవ్వాల, రేపు మద్యం అమ్మకాల టైమింగ్స్​లో మార్పు.. ఏపీలో ఉత్తర్వులు జారీ

అమరావతి, ఆంధ్రప్రభ: కొత్త సంవత్సరం రాకతో జోష్‌ మీదున్న మందుబాబులకు ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. రాష్ట్రంలో రెండు రోజుల పాటు అర్ధరాత్రి మద్యం అమ్మకాలకు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా కొత్త సంవత్సర ఆగమన వేడుకలకు యువత భారీగా సమాయత్తమైంది. గత రెండేళ్లుగా కరోనా ఆంక్షల నేపధ్యంలో అంతంత మాత్రంగానే నూతన సంవత్సర వేడుకలు చేసుకున్న వారంతా ఈ సారి భారీ ఏర్పాట్లు చేశారు. కొత్త సంవత్సరం ఆగమనం వారాంతపు రోజు రావడం, జనవరి 1న ఆదివారం కావడంతో వేడుకలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. రాష్ట్రంలో నెలకొన్న సందడి నేపధ్యంలో మద్యం దుకాణాల పని వేళలను పొడిగిస్తున్నట్లు ప్రభుత్వం శనివారం వెల్లడించింది.

శనివారం అర్థరాత్రి ఒంటి గంట వరకు మద్యం అమ్మకాలకు అనుమతిచ్చింది. ప్రభుత్వ మద్యం షాపుల్లో మాత్రం రాత్రి 12గంటల వరకే అమ్మకాలు జరుగనుండగా..బార్‌ అండ్‌ రెస్టారెంట్లలో ఒంటి గంట వరకు అమ్మకాలు నిర్వహించనున్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం మద్యం షాపుల్లో రాత్రి 9గంటల వరకు, బార్‌ అండ్‌ రెస్టారెంట్లలో రాత్రి 11గంటల వరకు ప్రస్తుతం అమ్మకాలకు అనుమతి ఉంది. కొత్త సంవత్సరం వేడుకలను దృష్టిలో ఉంచుకొని అమ్మకపు వేళలను పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. గతేడాది రాత్రి 10 గంటలకే మద్యం షాపులు మూసేయగా ఈ ఏడాది రాత్రి 12గంటల వరకు అనుమతిచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement