Monday, November 18, 2024

Hyderabad: చాంద్రాయ‌ణ‌గుట్ట ఫ్లైఓవ‌ర్ రేపే ప్రారంభం.. కేటీఆర్ ట్వీట్

హైద‌రాబాద్ సిటీ డెవ‌ల‌ప్‌మెంట్‌లో భాగంగా అవ‌స‌ర‌మైన చోట ప్ర‌భుత్వం ఫ్లైఓవ‌ర్ల‌ను నిర్మిస్తోంది. న‌గ‌ర ప్ర‌జ‌ల‌కు ట్రాఫిక్ క‌ష్టాలు ఉండొద్ద‌నే ఉద్దేశంతో ఇప్ప‌టికే ప‌లు ప్రాంతాల్లో అండ‌ర్ పాస్‌లు, ఫ్లై ఓవ‌ర్లు, లింక్ రోడ్ల‌ను టీఆర్ ఎస్ ప్ర‌భుత్వం నిర్మించింది. దీంతో అటు ప్ర‌జ‌లు, ఇటు వాహ‌న‌దారులు ఇబ్బందులు ప‌డ‌కుండా గ‌మ్య‌స్థానాల‌కు చేరుకుంటున్నారు. ఇక వ్యూహాత్మ‌క ర‌హ‌దారుల అభివృద్ధి కార్య‌క్ర‌మం(SRDP) కింద నిర్మించిన చాంద్రాయ‌ణ‌గుట్ట ఫ్లై ఓవ‌ర్‌ను రేపు (మంగ‌ళ‌వారం) ప్రారంభిస్తున్న‌ట్లు మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. 674 మీట‌ర్ల పొడ‌వున్న ఈ ఫ్లై ఓవ‌ర్‌ను రూ. 45.90 కోట్ల వ్య‌యంతో నిర్మించారు. వ్యూహాత్మ‌క రోడ్ల అభివృద్ధి కార్య‌క్ర‌మం కింద హైద‌రాబాద్ న‌గ‌రంలో మ‌రిన్ని మౌలిక స‌దుపాయాలు క‌ల్పిస్తామ‌ని కేటీఆర్ పేర్కొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement