Friday, November 22, 2024

Chandrayaan-3 | ఐదో దశ సక్సెస్‌.. అంతరిక్షంలో దూసుకెళ్తున్న మన రాకెట్

చందమామపై పరిశోధనల కోసం ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోట అంతరిక్ష కేంద్రం నుంచి బయల్దేరిన చంద్రయాన్‌-3 వ్యోమనౌక తన సుదూర ప్రయాణంలో మరో అడుగు ముందుకేసింది. స్పేస్‌ క్రాప్ట్‌ను చంద్రుడికి దగ్గరగా తీసుకెళ్లే క్రమంలో, ఇప్పటికే నాలుగుసార్లు కక్ష్యను పెంచిన ఇస్రో శాస్త్రవేత్తలు, ఇవ్వాల (మంగళవారం) 5వ దశ కక్ష్య పెంపు ప్రక్రియను కూడా విజయవంతంగా పూర్తిచేశారు. బెంగళూరులోని ఇస్రో ట్రాకింగ్‌ అండ్‌ కమాండ్‌ నెట్‌వర్క్‌ (ఐఎస్‌టిఆర్‌ఎసి) నుంచి స్పేస్‌క్రాప్ట్ కక్ష్య పెంపు ప్రక్రియను చేపట్టారు.

ప్రస్తుతం భూమికి 71351ల 233 కిలోమీటర్ల దూరంలోని కక్ష్యలో తిరుగుతున్న చంద్రయాన్‌-3 స్పేస్‌క్రాప్ట్‌, తాజాగా ఐదో దశ కక్ష్య పెంపుతో భూమికి 1,27,609ల236 కిలోమీటర్ల దూరంలోని కక్ష్యలోకి చేరనుందని అంచనా వేస్తున్నారు. కాగా భూమిచుట్టూ పరిభ్రమించే విషయంలో చంద్రయాన్‌-3కి ఇదే చివరి కక్ష్య. తదుపరి ఘట్టంలో భాగంగా వ్యోమనౌక చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశిస్తుంది.

- Advertisement -

ఈ పక్రియను ఆరో దశ కక్ష్యపెంపు (ట్రాన్స్‌ లూనార్‌ ఇంజక్షన్‌ ఎల్‌టి) గా పేర్కొంటారు. దీనిని ఆగస్టు 1న అర్ధరాత్రి 12 గంటల నుంచి ఒంటిగంట మధ్య చేపట్టనున్నట్లు ఇస్రో తెలిపింది. కాగా, ఈనెల 14 స్పేస్‌క్రాప్ట్ అంతరిక్షంలోకి దూసుకెళ్లిన తర్వాత 15న తొలి దఫా, 16న రెండో దఫా, 18న మూడో దఫా, 20న నాలుగో దఫా, 25న ఐదో దఫా కక్ష్య పెంపు ప్రక్రియలను విజయవంతంగా నిర్వహించారు.

భూమి సుధూర కక్ష్యను చేరుకున్న అనంతరం చంద్రయాన్‌-3 మిషన్‌ను భూమి-చంద్రుడి ట్రాన్స్‌ఫర్‌ కక్ష్యలోకి మళ్లించనున్నారు. ఆ తర్వాత స్పేస్‌క్రాప్ట్ చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశిస్తుంది. ముందస్తు ప్రణాళికల ప్రకారం అంతా సజావుగా జరిగితే, ఆగస్టు 23 లేదా 24వ తేదీల్లో స్పేస్‌క్రాఫ్ట్‌ చంద్రుడి ఉపరితలంపై అడుగిడే అవకాశం ఉందని ఇస్రో శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement