ఎయిరిండియా సంస్థకు కొత్త చైర్మన్‌గా టాటా సన్స్ చీఫ్ ఎన్ చంద్రశేఖరన్ నియమిస్తూ టాటా గ్రూప్ నిర్ణయం తీసుకుంది. సోమవారం జరిగిన బోర్డు మీటింగ్‌లో ఈ నియామకం ఖరారైందని సీనియర్ అధికారులు తెలిపారు. జనరల్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్‌కు చెందిన మాజీ సీఎండీ ఆలిస్ గీవర్గీస్ వైద్యన్‌ను బోర్డు స్వత్రంత్ర డైరెక్టరుగా నియమిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. కాగా చంద్రశేఖరన్ గత నెలలో రెండోసారి టాటా సన్స్ చైర్మన్‌గా ఎంపికయ్యారు.
ఐదేళ్లపాటు ఆయన పదవిలో కొనసాగనున్నారు. చంద్రశేఖరన్ ఇప్పటికే టాటా గ్రూప్‌లో పలు సంస్థలకు చైర్మన్‌గా ఉన్నారు. ఇంతకుముందు టాటా సన్స్ ఎయిరిండియాకు కొత్త చైర్మన్‌గా టర్కీకి చెందిన ఇల్కర్‌ను నియమించింది. అయితే ఆయన బాధ్యతలు స్వీకరించేందుకు ఇల్కర్ నిరాకరించడంతో కొత్త చైర్మన్‌గా చంద్రశేఖరన్‌ను నియమించాలని టాటా సన్స్ నిర్ణయించింది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..