నెల్లూరు జిల్లా కావలిలో దళితుడు దుగ్గిరాల కరుణాకర్ మృతిపై టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు డీజీపీకి లేఖ రాశారు. కరుణాకర్ ఆత్మహత్యకు కారకులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. కావలిలో కరుణాకర్ ఆత్మహత్య రాష్ట్రంలో శాంతి భద్రతల వైఫల్యానికి నిదర్శనమన్నారు. కరుణాకర్ ముసునూరులోని రెండు చేపల చెరువులను సబ్ లీజుకు తీసుకుని భారీగా పెట్టుబడి పెట్టారని, వైసీపీ నేతలు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి, సురేష్‌రెడ్డి చెరువుల్లో చేపలు పట్టకుండా అడ్డంకులు సృష్టించి కరుణాకర్‌ను వేధించారన్నారు. వైసీపీ నేతల వేధింపులకు తాళలేక కరుణాకర్ లేఖ రాసి ఆత్మహత్య చేసుకున్నారని చంద్రబాబు ఆ లేఖలో పేర్కొన్నారు. నిందితుల్లో ఒకరైన కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి శ్రీశైలం దేవస్థానం బోర్డులో పదవిలో కూడా ఉన్నారని, దళితులపై దాడుల ఘటనల్లో ఈ మూడేళ్లలో కఠిన చర్యలు లేకపోవడం వల్లనే నిందితులు బరితెగిస్తున్నారని మండిపడ్డారు. పోలీసులు సరైన, తక్షణ చర్యల ద్వారా మాత్రమే దళితులకు రక్షణ దొరుకుతుందని, ఆ దిశగా అధికారులు చర్యలు తీసుకోవాలని చంద్రబాబు సూచించారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement