తిరుపతి (రాయలసీమ ప్రభ వెబ్ ప్రతినిధి) : చిత్తూరు జిల్లా కుప్పం అసెంబ్లీ నియోజకవర్గంలో జరుగుతున్న గ్రానైట్ అక్రమ తవ్వకాలను, తమిళనాడు రాష్ట్రానికి కొనసాగుతున్న అక్రమ రవాణాను అడ్డుకోవాలని మాజీ ముఖ్యమంత్రి, తెలుగు దేశం పార్టీ అధినేత చంద్ర బాబు నాయుడు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి మంగళవారం లేఖ రాశారు. ఆ లేఖలో కుప్పం నియోజకవర్గంలోని శాంతిపురం, కుప్పం మండలాల్లో అక్రమంగా తవ్విన గ్రానైట్ రాళ్లను రాత్రి వేళల్లో తరలిస్తున్నారని, నదిమూర్, ఓఎన్ కొత్తూరు, మోట్ల చేను గ్రామాల మీదుగా తమిళనాడులోని క్రిష్ణగిరి, వెల్లూరు జిల్లాలకు గ్రానైట్ అక్రమ రవాణా జరుగుతోందని పేర్కొన్నారు. రాష్ట్రంలోని రాజకీయ నేతల ప్రమేయంతోనే ఈ రవాణా కొనసాగుతోందని ఆరోపిస్తూ గ్రానైట్ మాఫియా ద్వారా జరుగుతున్న ఈ గ్రానైట్ అక్రమ మైనింగ్, రవాణాను తక్షణమే అరికట్టి రాష్ట్ర ఖజానాకు జరుగుతున్న నష్టాన్ని నివారించాలని డిమాండ్ చేశారు. అంతేకాక ఈ విషయంలో ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో పాటు సరిహద్దులో అక్రమ రవాణాను అడ్డుకోవాలని తమిళనాడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి కూడా చంద్రబాబు లేఖను పంపారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement