ఎన్టీఆర్ బ్యూరో : వైసీపీ ప్రభుత్వం మీద పెల్లుబికిన ప్రజాగ్రహం ఈ సారి ఎన్నికలు స్పష్టంగా కనబడుతోందని తెలుగుదేశం పార్టీ ఉత్తరాంధ్ర ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న పేర్కొన్నారు. కూటమి అధికారంలోకి రాకుంటే తాను నాలుక కోసుకుంటా అన్నారు. విజయవాడ లోని పశ్చిమ నియోజకవర్గం లోని ఆయన కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బుద్దా వెంకన్న మాట్లాడుతూ .. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి సర్వే ఫలితాల కోసం చూశారని చెప్పరు. ఆరా మస్తాన్ తో వైసిపి వస్తుందని జగన్ చెప్పించారనీ, రేపు కూటమి రాకుంటే నేను నా నాలుక కోసుకుంటా అన్నారు.
కూటమి వస్తే ఆరా మస్తాన్ తన నాలుక కోసుకుంటాడా అని ప్రశ్నించారు. జగన్ నీ క్రిమినల్ ఆలోచనలతో ఫేక్ సర్వే చెప్పించావన్నారు. రేపు ఎన్నికలలో వైసీపీ ఓడితే… నా జీవితంలో అసెంబ్లీలో అడుగు పెట్టను అని చెప్పే దమ్ము, ధైర్యం జగన్ కు ఉందా అని సవాల్ విసిరారు. నిన్న వచ్చిన సర్వేల్లో ఎక్కువ భాగం కూటమి అధికారం ఖాయంగా చెప్పాయని గుర్తుచేశారు. చంద్రబాబు మళ్లీ సిఎంగానే అసెంబ్లీలో అడుగుపెడతా అని గతంలో ప్రకటించారనీ, అన్న విధంగా రేపు సీఎంగా అసెంబ్లీలో మా చంద్రబాబు అడుగు పెట్టడం ఖాయం అన్నారు.