అమరావతి, ఆంధ్రప్రభ: తెలుగు దేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు జిల్లా పర్యటనలకు శ్రీకారం చుట్టారు. బుధవారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబు పర్యటనలు ప్రారంభం అవుతున్నాయి. ఎన్టీఆర్ స్ఫూర్తి చంద్రన్నభరోసా పేరుతో ఏడాది పాటు పార్టీ అధినేత చంద్రబాబు పర్యటనలు ఉంటాయి. ఒక్కో టూర్‌లో మూడు రోజుల పాటు- చంద్రబాబు జిల్లాలలో పర్యటించనున్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ, విధ్వంస పాలనపై ప్రజల భవిష్యత్‌కు భరోసా ఇచ్చేలా అధినేత టూర్లు ఉండనున్నాయి.
శతజయంతిపై ఏడాది ఉత్సవాల నిర్వహణలో భాగంగా రేపు అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గంలో తొలి జిల్లా మహానాడు జరుగుతుంది. టూర్లో మొదటి రోజు మహానాడు మహాసభ ఏర్పాటు చేస్తున్నారు. రెండో రోజు పార్లమెంట్‌లోని 7 నియోజకవర్గాల నేతలు, ముఖ్య కార్యకర్తలతో ఆత్మీయ సమావేశం జరుగుతుంది. మూడో రోజు ప్రజాసమస్యలు, ప్రభుత్వ బాదుడే బాదుడుపై రోడ్ షోలు ఉండనున్నాయి. ఏడాది పాటు 100కి పైగా నియోజకవర్గాలు కవరయ్యేలా చంద్రబాబు పర్యటనలు నిర్వహించనున్నారు. అందులో భాగంగా నెలకు రెండు టూర్లు ఉండేలా ప్రణాళిక సిద్ధం చేశారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.