అమరావతి, ఆంధ్రప్రభ : టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరోసారి ఢిల్లి పర్యటనకు వెళ్లనున్నారు. ఈ నెల 5వ తేదీన ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగే రాజకీయ పక్షాల అధ్యక్షుల సమావేశంలో ఆయన పాల్గొననున్నారు. దేశంలో నిర్వహించనున్న జీ20 భాగస్వామ్య దేశాల సదస్సుకు సంబంధించి రాజకీయ పార్టీల అధ్యక్షులతో ప్రధాని మోదీ సమావేశమై వారి నుంచి సలహాలు, సూచనలు స్వీకరించనున్నారు. డిసెంబర్ 5న రాష్ట్రపతి భవన్‌లో సాయంత్రం 5 గంటలకు జరిగే ఈ సమావేశానికి హాజరు కావాలని చంద్రబాబుకు కేంద్రం నుంచి ఆహ్వానం అందింది.
ఈ సమావేశం అనంతరం చంద్రబాబు ఐదు నిమిషాల పాటు మోదీతో ఏకాంతంగా మాట్లాడటం రాజకీయ వర్గాల్లో పెనుచర్చకు దారి తీసింది. ఈ క్రమంలోనే మరోసారి చంద్రబాబు హస్తినకు పయనమై ప్రధానితో భేటీ కానుండటం రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకుంది.