Sunday, November 24, 2024

వైసీపీ ప్రభుత్వానికి చంద్రబాబు మరోసారి సెల్ఫీ ఛాలెంజ్‌

అమరావతి, ఆంధ్రప్రభ : అనంతపురం జిల్లాలో పర్యటిస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తాజాగా మరోసారి వైసీపీ ప్రభుత్వానికి సెల్ఫీ ఛాలెంజ్‌ను విసిరారు. ఉరవకొండ నియోజకవర్గ పరిధిలోని కౌకుంట్ల గ్రామం వద్ద హంద్రీనీవా కాలువ, పవన విద్యుత్‌ ప్రాజెక్ట్‌, డ్రిప్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్ట్‌లను బుధవారం సందర్శించిన ఆయన అక్కడినుంచే సెల్ఫీ సవాళ్లు విసిరారు.

హంద్రీనీవా కాలువ పనుల్లో ఎవరి హయాంలో ఎంత ఖర్చు పెట్టారో చెప్పగలరా అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. టీడీపీ హయాంలో గ్రీన్‌ ఎనర్జీ పాలసీ ద్వారా వచ్చిన విండ్‌ ఎనర్జీ టవర్స్‌ను చూపిస్తూ చంద్రబాబు మరో సెల్ఫీ ఛాలెంజ్‌ విసిరారు. విండ్‌ ఎనర్జీ, సోలార్‌ ఎనర్జీల ద్వారా ఎవరి హయాంలో ఎంత విద్యుత్‌ ఉత్పత్తి జరిగిందో చెప్పగలరాని నిలదీశారు.

ఇక డ్రిప్‌ ఇరిగేషన్‌ పైన కూడా సవాల్‌ విసిరారు. ఆనాడు టీడీపీ హయాంలో డ్రిప్‌ ఇరిగేషన్‌కి ఇచ్చిన సబ్సీడీలను ప్రస్తావించిన చంద్రబాబు అనంతపురంలో ప్రారంభించిన సామాజిక డ్రిప్‌ ప్రాజెక్ట్‌ ఏమైందని ప్రశ్నించారు. గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన అభివృద్ధి పనుల ప్రదేశాల్లో సెల్ఫీలు దిగిన చంద్రబాబు ఇది ప్రజలకు మేలు చేసే విధానమంటూ పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement