మాజీ ముఖ్యమంత్రి టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకు సిఐడి అధికారులు నోటీసులు అందించారు . మంగళవారం ఉదయం హైదరాబాదులోని చంద్రబాబు నివాసానికి వెళ్లిన సిఐడి అధికారులు ఈ నోటీసులను అందచేశారు.
అమరావతి రాజధాని లో అసైన్డ్ భూముల వ్యవహారంలో చంద్రబాబుకు నోటీసు ఇచ్చినట్లు సమాచారం.. 41 సిఆర్పిసి కింద నోటీసులు ఇచ్చామని విచారణ కు హాజరు కావాల్సి ఉంటుందని సీఐడీ చీఫ్ సునీల్ కుమార్ తెలిపారు. మున్సిపల్ ఎన్నికలల్లో ఘోర పరాజయం తర్వాత చంద్రబాబునాయుడుకు నోటీసులు రావటం చర్చనీయాంశంగా మారింది. అటు ఇదే కేసులో చంద్రబాబుతో పాటు ఏపీ మాజీ మంత్రి పి.నారాయణకు కూడా సీఐడీ నోటీసులు జారీ చేసింది. ప్రస్తుతం మంత్రి నారాయణ హైదరాబాద్‌లో లేరు. ఆయన ఈ నెల 23న విచారణకు రావాలని అధికారులు నోటీసుల్లో పేర్కొన్నట్లు తెలుస్తోంది. కాగా ఈ నోటీసులపై ఇప్పటిరకు చంద్రబాబు, నారాయణ స్పందించలేదు.