విజయనగరం – అంగళ్లులో తనను చంపాలని చూశారని సంచలన ఆరోపణలు చేశారు టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు . తనపై జరిగిన హత్యాయత్నానికి పోలీసులు కూడా సహకరించారని ఆరోపించారు. ఈ రోజు విజయనగరంలో మీడియాతో చంద్రబాబు మాట్లాడుతూ.. “మమ్మల్ని చంపి రాజకీయాలు చేస్తారా? రాష్ట్ర ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తోంది. అంగళ్లు అల్లర్లపై సీబీఐతో విచారణ జరిపించాలి. నన్ను చంపడానికి ప్రయత్నిస్తున్నది ఎవరో విచారణలో తేలాలి” అని డిమాండ్ చేశారు.
టీడీపీ కేడర్‌పైనా దాడులు చేస్తున్నారని సీరియస్ అయ్యారు. పైగా ఇప్పుడు తనపైనే కేసులు పెడుతున్నారని చెప్పారు. అసమర్థ నాయకుడు ముఖ్యమంత్రి అయితే వ్యవస్థలు ఇలాన ఉంటాయని ఫైరయ్యారు. ‘‘తంబళ్లపల్లి, అంగళ్లులో నాపై హత్యాయత్నం చేశారు. కానీ ఇప్పుడు నాపైనే హత్యాయత్నం కేసు పెట్టారు. ఇలాంటిది ఎక్కడా చూడలేదు. సైకో ముఖ్యమంత్రి ఆదేశాలతోనే నన్ను తిరగనివ్వడంలేదు. ప్రజల తరఫున పోరాడకుండా అడ్డుకుంటున్నారు” అని చంద్రబాబు నిప్పులు చెరిగారు. ఒక పథకం ప్రకారం తనను అడ్డుకుని, హత్య చేయడానికి ప్రయత్నించారని టీడీపీ చీఫ్ చంద్రబాబు ఆరోపించారు. ఎక్కడికెళ్లినా తనపై దాడులు చేస్తున్నారని మండిపడ్డారు. ‘‘నేను పారిపోవాలా? ఎన్‌ఎస్‌జీ భద్రత ఉన్న నేనే పారిపోతే ఇక అర్థమేముంది? వైసీపీ ప్రభుత్వం చేసే దోపీడీని, అవినీతిని నేను ఎదుర్కొని తీరుతాను” అని తేల్చి చెప్పారు.
మీడియా సమావేశంలో చంద్రబాబు ఏమన్నారంటే…
ఎన్ ఎస్ జీ, మీడియా, ప్రజలు సాక్షిగా నాపై దాడి జరిగింది..
నాపై చాలా సార్లు హత్యాయత్నం చేయాలని ప్లాన్ చేశారు..
సైకో ముఖ్యమంత్రి అదేశాలతోనే నాపై హత్యాయత్నం..
సైకో చెప్పాడు కాబట్టే మంత్రి పెద్దిరెడ్డి, అతడి తమ్ముడు నాపై దాడికి యత్నించారు..
అంగళ్లకు చేరుకునే లోపే రూ.5 వేల కోట్ల స్కామ్ ను బయట పెట్టాను..
రెండు ప్రాజెక్ట్ ల ద్వారా మంత్రి పెద్ది రెడ్డి సుమారు రూ. 3 వేల కోట్ల స్కామ్ చేశారు..
మీ అక్రమాలు బయట పెట్టాను అని నన్ను చంపాలని యత్నిస్తారు..
దాడులు చేసి, తిరిగి నాపై కేసులు పెడతారా.. నాతో ఎవరు వస్తే వాళ్లపై కేసులా..
బెదిరించి స్టేట్మెంట్ లు తీసుకుని కేసులు పెడుతున్నారు..
విలువలు కలిగిన అశోక్ గజపతి రాజుపై కేసులు పెట్టి వేదించారు.
ఈనాడు రామోజీ రావు, ఆంధ్ర జ్యోతి రాధాకృష్ణ, టీవి 5 పై, ఎందరో నేతలపై కేసులు పెట్టారు.
చిరంజీవి మాటలాడితే ఆయనపై మాటల దాడి చేస్తున్నారు..
పోలీసులను పార్టనర్స్ ను చేసి, వారి అరాచకాలకు పోలీసులను వినియోగిస్తున్నారు..
రాత్రి నేను వస్తుండగా కోరుకొండలో విద్యుత్ కోతలు విధించారు..
మాకు పోలీస్ లు ప్రత్యర్ధులు కాదు. రాష్ట్రాన్ని నాశనం చేస్తుంటే నేను రాజకీయంగా మాట్లాడితే నాపై దాడి చేసి హత్య చేస్తారా..
నా ప్రోగ్రామ్ కి వైసీపీ వాళ్ళు ఎందుకు వస్తారు..
ఇన్ని కేసులు పెట్టినా నేను ఎన్నడూ భయపడలేదు. అంగళ్ల ఘటనపై సీబీఐ విచారణ జరగాల్సిందే..
పిచ్చోడి చేతిలో రాయి ఉంటే, వాడినైనా కొట్టుకుంటాడు. లేదా మనల్ని కొడతాడు. ఈ రాష్ట్రంలో అదే జరుగుతోంది.
రాష్ట్ర పతి, ప్రధాన మంత్రి, రాష్ట్ర గవర్నర్ కి ఫిర్యాదు చేస్తాం..
సీబీఐ విచారణ జరిగే వరకు వదిలిపెట్టం..
లీగల్ గా, పొలిటికల్ గా ఫైట్ చేస్తాం. ప్రజా క్షేత్రంలో వారిని దోషులుగా నిలబెడతాం..
బాబాయ్ వివేకా నంద రెడ్డి హత్యను చూశాం. ఎన్ని ట్విస్ట్ లు చెప్పారు..
కోడి కత్తి కేసులో ఎన్ ఐఏను తప్పు బట్టించడం..
ప్రజలు తిరుగుబాటు చేస్తే వైసీపీ నేతలు పారిపోవాల్సిందే..