ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో రసవత్తర సన్నివేశం నెలకొంటోంది. యూపీ సీఎంయోగి ఆదిత్యనాథ్ పోటీ చేస్తున్న గోరఖ్పూర్ స్థానం నుంచి ఆజాద్ సమాజ్ పార్టీ అధినేత చంద్రశేఖర్ ఆజాద్ పోటీ చేయనున్నట్టు ప్రకటించారు. ఆజాద్ సమాజ్ పార్టీ యూపీ అసెంబ్లీ ఎన్నికల కోసం 33 మంది అభ్యర్థులతో తొలి జాబితాను విడుదల చేసింది. ఆ సమయంలో చంద్రశేఖర్ ఆజాద్ పోటీ చేయనున్నట్టు ప్రకటించిన సీటుపై ఇప్పుడు అంతటా చర్చ జరుగుతోంది.
ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో తొలుత సమాజ్వాది పార్టీతో పొత్తు ఉంటుందని చంద్రశేఖర్ ఆజాద్ ప్రకటించిన కొద్దిసేపటికే తన మాట వెనక్కి తీసుకున్నారు. ఈ సారి ఆజాద్ సమాజ్ పార్టీ ఒంటరిగా పోటీ చేస్తుందని ఆయన తెలిపారు. ఆజాద్ సమాజ్ పార్టీ రెండేళ్ల కిందటే ఆవిర్భవించింది. కాగా,ఈ ఎన్నికలు ఆ పార్టీకి కీలకం కానన్నయి. 2020లో బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు అది మూడో స్థానాన్ని కైవసం చేసుకోవడం గమనార్హం. ఆజాద్‌కు పెద్ద లీడర్లను సవాల్ చేయడం కొత్తేమీ కాదు. 2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా వారణాసి లోక్‌సభ నియోజకవర్గం నుండి పోటీ చేయనున్నట్టు ప్రకటించారు. కాగా, యోగి ఆదిత్యనాథ్ గోరఖ్‌పూర్ నుంచి ఐదుసార్లు ఎంపీగా గెలిచి తన పట్టు నిలుపుకున్నారు. అట్లాంటి చోట ఆజాద్ యోగిపై పోటీ చేసి గెలుస్తానని సవాల్ చేయడంపై ఇప్పుడు చర్చకు దారితీసింది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసంఫేస్‌బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..