Wednesday, November 20, 2024

వార్నీ.. 70వేల స్కూటీకి 15లక్షలతో నెంబర్ ప్లేట్.. అతనికేమన్న పిచ్చా ఏంటీ?

అసలు తురుంఖాన్ అంటే ఇతనే అని చెప్పాలి.. ఎందుకంటే 70వేలు పెట్టి కొన్న యాక్టివా స్కూటర్ కోసం ఏకంగా 15 లక్షలు పెట్టి నెంబర్ప్లేట్ కొనుగోలు చేశాడు. ఇది హర్యానాలో జరిగింది. సూపర్ వీఐపీ నెంబర్ కోసం అక్కడ ఆర్టీఏ ఆఫీసర్లు 0001 నెంబర్ కోసం 5 లక్షల ప్రారంభ ధరతో వేలం పాట నిర్వహించారు. దీనికి పెద్ద ఎత్తున డిమాండ్ రావడంతో అలా వేలం పెరుగుతూ పోయింది. ఏకంగా ఓ వ్యక్తి అయితే తన స్కూటీ కోసం 15.44లక్షలతో ఈ నెంబర్ కైవసం చేసుకున్నాడు. అయితే ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది.. అందేంటంటే..

సూపర్ వీఐపీ ‘0001’ నెంబర్ ప్లేట్‌ను పొందండి అన్న ప్రకటనతో చాలామంది క్యూ కట్టారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే హోండా యాక్టివా స్కూటర్ కోసం రూ. 15.44 లక్షలు చెల్లించి ఈ నంబర్ ప్లేట్‌ను కొనుగోలు చేశాడు. స్కూటీ ధర రూ. 71,000 (ఎక్స్-షోరూమ్, ప్రారంభ ధర). చండీగఢ్ రిజిస్టరింగ్, లైసెన్సింగ్ అథారిటీ ఇటీవల నిర్వహించిన వేలంలో యాక్టివా స్కూటర్ యజమాని బ్రిజ్ మోహన్ ఈ ఫ్యాన్సీ నంబర్‌ను పొందారు.

రాష్ట్రానికి అదనపు ఆదాయాన్ని ఆర్జించేందుకు హర్యానా ప్రభుత్వం ‘0001’ నంబర్ ప్లేట్‌లను వేలంలో ఉంచుతుందని ఇటీవల సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ ప్రకటించారు. CH01- CJ-0001ని వేలంలో పొందిన బ్రిజ్ మోహన్ ఒక అడ్వర్టైజింగ్ ఏజెన్సీని నడుపుతున్నాడు. చండీగఢ్ రిజిస్టరింగ్ అండ్ లైసెన్సింగ్ అథారిటీ 378 ఫ్యాన్సీ రిజిస్ట్రేషన్ నంబర్లను వేలం వేసి 1.5 కోట్లు ఆర్జించింది. కాగా, ‘CH01- CJ-0001’ నెంబర్ని 500,000 బేస్ ధర వద్ద వేలానికి ఉంచారు. కానీ, ఏకంగా ఇది 15.44 లక్షలకు అమ్ముడుపోయింది. మీరు దీని గురించి ఊహించుకునే ముందు బ్రిజ్ మోహన్ ఈ నంబర్ ప్లేట్‌ను తన భవిష్యత్ వాహనం కోసం రిజర్వ్ చేసుకోవడానికి కొనుగోలు చేసినట్టు చెబుతున్నాడు. 2022 దీపావళి సందర్భంగా కొనుగోలు కొనాలనుకునే తన కారు కోసం ఈ నెంబర్ప్లేట్ని వినియోగించనున్నట్టు చెబుతున్నాడు.

మొదట ఈ నంబర్ తన హోండా యాక్టివాకే కనిపిస్తుందని.. అయితే అది మైగ్రేట్ చేయడం ద్వారా దాన్ని తన కారుకు పెట్టుకుంటానని అతను తెలిపాడు. అతని కొత్త కారుకి ఇప్పటి వరకు 0001 నంబర్ ప్లేట్‌ను ఉపయోగిస్తున్న 179 రాష్ట్ర ప్రభుత్వ వాహనాలున్నాయి. వాటిలో నాలుగు ML ఖట్టర్ వ్యక్తిగత కాన్వాయ్‌లో ఉన్నాయి. ఇటీవల అతను 0001 నంబర్‌లను వదిలివేసి రూ. 5 లక్షల నుండి బిడ్డింగ్‌తో ఇ-వేలం నుండి అదనపు ఆదాయాన్ని పొందాలని నిర్ణయించుకున్నాడు. అతని అంచనా ప్రకారం ఈ ఫ్యాన్సీ నంబర్ ప్లేట్ల ఇ-వేలం ద్వారా అతనికి రూ. 18 కోట్ల ఆదాయం సమకూరుతుందని తెలుస్తోంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement