Friday, November 22, 2024

కెనడా ఆర్మీలోకి వలసపౌరులు, సైన్యంలోకి భారీగా నియామకాలు..

కెనడా సైనిక దళం భారీ ప్రకటన చేసింది. ఆ దేశంలో ఉన్న శాశ్వత నివాసితులకు బంపర్‌ ఆఫర్‌ ఇచ్చింది. పర్మినెంట్‌ రెసిడెంట్స్‌ మిలిటరీలో చేరవచ్చు అని ప్రకటించింది. కెనడాలో ఎక్కువ సంఖ్యలో ఉన్న భారతీయులకు ఈ ప్రకటన వరంగా మారనుంది. రిమెంబరెన్స్‌ డే నేపథ్యంలో ఈ ప్రకటన చేశారు. 2021 డేటా ప్రకారం కెనడాలో 80 లక్షల మంది వలసవాదులు శాశ్వత నివాసితులుగా గుర్తింపు పొందారు. కెనడా జనాభాలో వలసవాదులు 21.5 శాతం ఉన్నారు. 2021లో లక్ష మంది భారతీయులకు కెనడా ప్రభుత్వం పర్మినెంట్‌ రెసిడెన్సీ (పిఆర్‌) కల్పించింది. రాబోయే రెండేళ్లలో మరో పది లక్షల మందికి పిఆర్‌ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.

గతంలో పౌరసత్వం పొందిన విదేశీయులను ది స్కిల్డ్‌ మిలటరీ ఫారెన్‌ అప్లికెంట్‌ అనే ప్రోగ్రాం కింద నియమించుకునేవారు. కెనడా సైన్యంలో ప్రత్యేక అవసరాలుతీర్చేవారు. తక్కువ శిక్షణ అవసరమైన వారిని ఈ పద్ధతిన నియమించుకునే వారు. ముఖ్యంగా పైలట్లు, డాక్టర్లు వంటి సేవల్లో విదేశీయులు సేవలు అందించేవారు. కానీ, తాజా నిర్ణయంతో కెనడా పౌరసత్వం లభించిన 18 ఏళ్లు నిండిన వారందరికీ సైన్యంలో అవకాశాలు లభించనున్నాయి. 16ఏళ్లు వయసున్నా తల్లిదండ్రుల అనుమతి ఉన్నవారికీ అవకాశం లభిస్తుంది. 10 లేదా12 గ్రేడ్‌ ఉత్తీర్ణులై ఉండాలనే నిబంధన ఉంది.

- Advertisement -

నియామకాలు గణనీయంగా తగ్గాయని ది కెనెడియన్‌ ఆర్మ్‌డ్‌ ఫోర్సెస్‌ రెండు నెలల కిందట ఆందోళన వ్యక్తంచేసింది. అవసరమైన వారిలో కేవలం సగం మంది మాత్రమే అందుబాటులో ఉన్నారని పేర్కొంది. రాబోయే రోజుల్లో నెలకు 5900 నియామకాలు జరిగే తప్ప సైనిక అవసరాలు తీరని పేర్కొంది. రష్యా చేపట్టిన యుద్ధం కారణంగా తలెత్తిన పరిస్థితుల దృష్ట్యా కెనడా సైన్యాన్ని విస్తరించాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆ దేశ రక్షణ మంత్రి అనితా ఆనంద్‌ పేర్కొన్నారు. 2023-25 మధ్య కాలంలో దాదాపు 5 లక్షల మంది వలసదారులకు పౌరసత్వాలు ఇవ్వాలని ఇటీవల కెనడా ప్రభుత్వం నిర్ణయించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement