Wednesday, November 20, 2024

వడ్డీ రేట్లు పెంచే ఛాన్స్‌, ఏడాదిలో 2 లేదా 3 సార్లు..

రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) వడ్డీ రేట్ల పెంపుపై హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు సీఈఓ, వైస్‌ చైర్మన్‌ కేకి మిస్త్రి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఏడాది రెపో రేటు రెండు లేదా మూడు సార్లు తప్పక పెరిగే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. వచ్చే ద్రవ్య సమీక్షలో ఆర్‌బీఐ కీలక వడ్డీ రేట్లను పెంచుతుందని అభిప్రాయపడ్డారు. వడ్డీ రేటు విషయంలో ఆర్‌బీఐ తీరును తప్పుబట్టలేమన్నారు. వాస్తవానికి ఉపాధి కల్పన, ప్రజల ఆదాయం పెరుగుదలకు, వినియోగ సామర్థ్యం పుంజుకోవడానికి ఆర్థిక వ్యవస్థలో ప్రగతి అనేది దేశానికి చాలా ముఖ్యమని తెలిపారు. ఈ క్రమంలో వడ్డీ రేట్లు పెరగడంతో దేశ ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం ఏమీ ఉండదని తెలిపారు. ద్రవ్యోల్బణం విషయంలో భారత్‌-అమెరికా మధ్య పోలిక వద్దని చెప్పారు.

అమెరికాలో ఎప్పుడు ద్రవ్యోల్బణం ఎక్కువే అని, భారత్‌లో తక్కువే అన్నారు. అమెరికాలో 8.5 శాతానికి పైగా ఉంటే.. భారత్‌లో 5.7 శాతం వద్దే ఉందని తెలిపారు. ఆర్థిక పునరుద్ధరణకు ముందు వడ్డీ రేట్లను పెంచడం వృద్ధిని దెబ్బతీస్తుందని ఆర్బీఐకి తెలుసు అని చెప్పారు. తన 40 ఏళ్ల అనుభవంలో హౌసింగ్‌ లోన్స్‌పైన వడ్డీ రేట్లు ఈ స్థాయికి తగ్గడం చూడలేదన్నారు. ఇప్పటికి ఇప్పుడు వడ్డీ రేట్లు పెరగకపోయినప్పటికీ.. 2022లో మాత్రం వడ్డీ రేట్లను మూడు సార్లు పెంచొచ్చని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు సీఈఓ, వైస్‌ చైర్మన్‌ మిస్త్రి అభిప్రాయపడ్డారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement