క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి, మార్చి నెలల్లో జరగనున్న ఈ మెగా టోర్నీ షెడ్యూల్‌ను ఐసీసీ అధికారికంగా ప్రకటించింది. ఈ మెగా టోర్నీకి పాకిస్థాన్ ఆతిథ్యం ఇస్తుండగా.. మ్యాచ్‌లు హైబ్రిడ్ పద్ధతిలో జరగనున్నాయి.
పాకిస్థాన్‌లోని కరాచీ, లాహోర్, రావల్పిండిలలో మ్యాచ్‌లు జరగనుండగా, భారత్‌కు తటస్థ వేదికగా దుబాయ్‌ని ఎంచుకున్నారు.
కాగా, ఐసీసీ షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరి 19న కరాచీలో పాకిస్థాన్-న్యూజిలాండ్ మధ్య తొలి మ్యాచ్ జరగనుండగా.. టీమిండియా 20న తొలి మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్‌లో భారత జట్టు బంగ్లాదేశ్‌తో తలపడనుంది. ఇక ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్-పాకిస్థాన్ జట్ల మధ్య ఫిబ్రవరి 23న మ్యాచ్ జరగనుంది.
ఇక ఈ మెగా టోర్నీలో మొత్తం ఎనిమిది జట్లు పాల్గొననున్నాయి.
గ్రూప్-ఎ : భారత్, పాకిస్థాన్, బంగ్లాదేశ్, న్యూజిలాండ్ ఉన్నాయి.
గ్రూప్-బి : దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, ఆఫ్ఘనిస్థాన్, ఇంగ్లండ్ ఉన్నాయి.
మార్చి 4న తొలి సెమీఫైనల్, మార్చి 5న రెండో సెమీఫైనల్ జరగనుండగా.. మార్చి 10న ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఇక మార్చి 11న రిజర్వ్.