Saturday, January 18, 2025

Champions Trophy | హాట్ ఫేవ‌రేట్ పాకిస్థాన్ : గ‌వాస్క‌ర్

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మెగా ఐసీసీ ఈవెంట్.. ఛాంపియన్స్ ట్రోఫీ 2025 వచ్చే నెలలో ప్రారంభం కానుంది. పాకిస్థాన్ ఆతిథ్యమిస్తోన్న ఛాంపియన్స్ ట్రోఫీ హైబ్రిడ్ మోడల్ లో జ‌ర‌గ‌నుండ‌గా.. ఫిబ్రవరి 19న టోర్నీకి తెర‌లేవ‌నుంది.

కాగా, టోర్నీలో ఎనిమిది దేశాలు పాల్గొంటుండ‌గా.. ఈ టోర్నీలో ఎవరు గెలిచే అవకాశం ఉందనే దానిపై క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ తన విశ్లేషణను అందించారు. ఛాంపియన్స్ ట్రోఫీలో పోటీ తీవ్రంగా ఉన్నప్పటికీ… పాకిస్థాన్ హాట్ ఫేవరెట్ అని.. ఆతిథ్య జట్టుకే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయని గవాస్కర్ అన్నారు.

గత వన్డే ప్రపంచకప్‌లో భారత్‌ ఫైనల్‌కు వెళ్లిన సంగ‌తి గుర్తు చేశారు. ఫైనల్స్‌లో భారత్‌ ఓడిపోయినా.. వరుస మ్యాచ్‌ల్లో విజయం సాధిస్తూ ఫైన‌ల్స్ కు దైసుకెళ్లింద‌ని చెప్పాడు. ఇప్పుడు పాకిస్థాన్‌కు కూడా అలాంటి అవకాశం వచ్చిందని అన్నారు. స్వదేశంలో పాకిస్థాన్‌ను ఓడించడం అంత ఈజీ కాదన్నాడు. అందుకే తాను పాకిస్థాన్‌ను ఫేవరెట్‌గా భావిస్తున్నట్లు తెలిపాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement