జార్ఖండ్ రాష్ట్రంలో రాజకీయ హైడ్రామాకు తెరపడింది. అధికార జేఎంఎం కూటమి శాసనసభాపక్ష నేత చంపై సోరెన్ జార్ఖండ్ తదుపరి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. శుక్రవారం రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా చంపై ప్రమాణం చేశారు. రాంచీలోని రాజ్‌భవన్‌లో గవర్నర్ సీపీ రాధాకృష్ణన్.. చంపైతో ప్రమాణ స్వీకారం చేయించారు.
చంపైతో పాటు పలువురు ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణం చేశారు. ఈడీ అరెస్టు నేపథ్యంలో ముఖ్యమంత్రి పదవికి జేఎంఎం నేత హేమంత్ సోరేన్ రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఆయన రాజీనామా తర్వాత కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు అధికార సంకీర్ణ శాసనసభా పక్ష నేతగా ఎన్నికైన చంపై సోరెన్ సంసిద్ధత వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఆయన సీఎం పదవి చేపట్టారు.