సీనియర్ నటుడు చలపతిరావుతో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కి మంచి అనుబంధం ఉంది.పలు చిత్రాల్లో వీరిద్దరూ కలిసి నటించారు. దీంతో చలపతిరావు మరణవార్త జూనియర్ ఎన్టీఆర్ ను తీవ్రంగా కలచివేసింది. అమెరికాలో ఉన్న జూనియర్ ఎన్టీఆర్ చలపతిరావు కుమారుడు రవి బాబుకు వీడియో కాల్ చేసి తన తీవ్ర సానుభూతి వ్యక్తం చేశారు. ఈ వీడియోను ధనుష్ తన ట్విట్టర్ అకౌంట్ లో షేర్ చేశారు. ఈ వీడియో కాల్ లో లే బాబాయ్ లే అని చలపతిరావును పిలుస్తూ తారక్ భావోద్వేగానికి లోనయ్యారు. మరోవైపు జూనియర్ ఎన్టీఆర్ తన ట్విట్టర్ ఖాతాలోనూ సంతాపం వ్యక్తం చేస్తూ ట్వీట్ పెట్టారు. చలపతి రావు గారి అకాల మరణం నన్ను ఎంతగానో కలచివేసింది. నందమూరి కుటుంబం ఇవాళ ఒక కుటుంబ సభ్యుడిని కోల్పోయింది. తాత గారి రోజుల నుంచి మా కుటుంబానికి అత్యంత ఆప్తుడైన చలపతి రావు గారి మృతి మా అందరికీ తీరని లోటు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని నా ప్రార్ధన’’ అని తారక్ ట్వీట్ చేశాడు.
Advertisement
తాజా వార్తలు
Advertisement