Tuesday, November 26, 2024

ప‌లు ఆల‌యాల్లో ప్ర‌త్యేక పూజ‌లు జ‌రిపిన‌ – ఉప్పల శ్రీనివాస్ గుప్త దంపతులు

నల్గొండ జిల్లా, నాగార్జున సాగర్ నియోజకవర్గం, తిరుమలగిరి (సాగర్) మండలం కోనేటి పురం గ్రామంలో గుట్ట మీద ఉన్న
తిరుమలనాధ స్వామి జాతర, శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర టూరిజండెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్త దంపతులు విచ్చేశారు.శ్రీ తిరుమలనాధ స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ తర్వాత ఆంజనేయ స్వామి ఆలయంలో,యల్లమ్మ తల్లి పుట్ట దగ్గర
పూజలు నిర్వహించారు. తదనంతరం వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవ కార్యక్రమంలో భాగంగా ఉప్పల శ్రీనివాస్ గుప్త-స్వప్న ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంత‌రం పెద్దపూర మండలం, చలకుర్తి గ్రామంలో మాఘ శుద్ధ పౌర్ణమి సందర్భంగా జరిగిన సమ్మక్క సారలమ్మ దేవతల జాతర మహోత్సవానికి ఉప్పల శ్రీనివాస్ గుప్త-స్వప్న విచ్చేశారు. ఈ సందర్భంగా టూరిజం చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్త గారు మాట్లాడుతూ.. అనాదిగా వస్తున్న ఆచారం మన సంస్కృతి సంప్రదాయాలు మన పండుగలు అని అన్నారు. అలాంటి పండుగలు మన తెలంగాణ లో అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి.ముఖ్యంగా పల్లెటూర్ల లో దేవాలయంలో పండుగలు అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు.

జాతర అంటేనే పండుగ, రైతులు ఆరుగాలం కష్టించి,పండించిన పంట చేతికి వచ్చినప్పుడు, ప్రతి సంవత్సరం అందరూ కలిసి చేసుకునే పండుగ అని గుర్తు చేశారు.తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బంగారు తెలంగాణ కు బాటలు వేస్తూ.. ఎన్నో సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తూ.. సంక్షేమంలో, అభివృద్ధి లో తెలంగాణ ను దేశంలో నెంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దుతున్న గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో జీవించాలని కోరుకున్నట్లు తెలిపారు.ఈ కరోనా మహమ్మారి పూర్తిగా తొలగిపోవాలని, రాష్ట్ర ప్రజలు, సుభిక్షంగా ఉండాలని, రైతులు అంతా పాడి పంటలతో విలసిల్లాలని అందరూ ఆనందంగా వుండాలని కోరుకున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో.. ఆలయ చైర్మన్ బుర్రి రాంరెడ్డి, Trs పార్టీ యూత్ జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీనాధ్, తిరుమలగిరి సాగర్ ఎంపీపీ భగవాన్ నాయక్, జడ్పీటీసీ సూర్య భాష్య, వైస్ ఎంపీపీ యడవెళ్లి దిలీప్ రెడ్డి, తూటిపేటతండ సర్పంచ్ ఎమ్.రాంషి, సర్పంచ్ నీలావత్ కోట్యా నాయక్ మరియు Trs నాయకులు తదితరులు పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement