Friday, November 22, 2024

అరుణాచ‌ల్ ప్ర‌దేశ్ బోర్డ‌ర్ లో జిన్ పింగ్ అనూహ్య పర్యటన..

చైనా ను ఓ వైపు వరదలు ముంచెత్తుతుంటే ఆ దేశ అధ్య‌క్షుడు జీ జిన్‌పింగ్‌.. స‌రిహ‌ద్దుల్లో ప‌ర్య‌టిస్తున్నారు. అరుణాచ‌ల్ ప్ర‌దేశ్ బోర్డ‌ర్ స‌మీపంలో ఉన్న ఓ గ్రామంలో అధ్య‌క్షుడు జిన్‌పింగ్ ప‌ర్య‌టించారు. టిబెట్ ప‌ర్య‌ట‌న‌లో భాగంగా ఆయ‌న ఆ బోర్డ‌ర్ ప్ర‌దేశాల‌ను విజిట్ చేశారు. అరుణాల్‌కు బోర్డ‌ర్‌కు 20 కిలోమీట‌ర్ల దూరంలో ఉన్న టిబెట్ ప్రాంతంలో జిన్‌పింగ్ విమానం ల్యాండ్ అయ్యింది. ఓ వైపు తమ దేశం వర్షాలు, వరదలతో అల్లాడుతుండగా ఆయన టిబెట్ విజిట్ షాక్ ఇచ్చారు. లాసా లోని బార్ ఖోర్ ఏరియాలో ఆయన గురువారం స్థానికులను ఉద్దేశించి ప్రసంగిస్తున్న వీడియోలు బయటికొచ్చాయి.

టిబెట్ రాజ‌ధాని లాసా ప‌ర్య‌ట‌న‌కు ముందు.. ఆయ‌న య‌ర్లుంగ్ జాంగ్బో(బ్ర‌హ్మ‌పుత్ర‌) న‌ది వ‌ద్దకు వెళ్లి బ్రిడ్జ్ ప‌నుల‌ను ప‌ర్య‌వేక్షించారు. య‌ర్లుంగ్ న‌ది అరుణాచ‌ల్ ప్ర‌దేశ్‌లో క‌ల‌వ‌క‌ముందు ఉన్న టిబెట్‌లోని గ్రేట్‌బెండ్‌ లోయ ప్రాంతాల్లో చైనా బ్రిడ్జ్ క‌డుతున్న విష‌యం తెలిసిందే. సిచువాన్‌-టిబెట్ రైల్వే ప్రాజెక్టు ప‌నుల‌ను కూడా ప‌రిశీలించేందుకు ఆయ‌న నింగ్చి రైల్వే స్టేష‌న్‌కు వెళ్లారు. అక్క‌డ నుంచి ఆయ‌న లాసాకు రైళ్లో వెళ్లారు. టిబెటన్ల బౌద్ధ గురువు దలైలామా వింటర్ రెసిడెన్స్ అయిన ‘పొటాలా ప్యాలస్’ వద్ద మాట్లాడిన ఆయన..ఇది టిబెట్ కి శాంతియుత విముక్తిని ప్రసాదించే కట్టడం( మాన్యుమెంట్) అని పేర్కొన్నారు. ఈ నెల 20 న కూడా జిన్ పింగ్.. టిబెట్ భూభాగమైన నింగిత్రి లో జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతూ .. 17 పాయింట్లతో తమ దేశం కుదుర్చుకున్న ఒప్పందం కుదిరి 70 ఏళ్ళు అయిందని, పదేళ్ల క్రితం దీని 60 వ యానివర్సరీని పురస్కరించుకుని కూడా తాను ఈ ప్రాంతాన్ని సందర్శించానని చెప్పుకున్నారు. వివక్షకు గురయ్యే ఏ ఒక్క జాతినీ ఆధునిక సోషలిస్టు చైనా ఆవిర్భావంలో తాము విస్మరించే ప్రసక్తే లేదని ఆయన చెప్పారు. అన్ని జాతులనూ కలుపుకుని పోతామన్నారు.

ఇది కూడా చదవండి: సీఎం జగన్ అలా చేస్తాడని అనుకోవడం లేదు: రఘురామకృష్ణరాజు

Advertisement

తాజా వార్తలు

Advertisement