Friday, November 22, 2024

భారత్-పాక్ చర్చలు: చైనా హ్యాపీ

ఇటీవల భారత్-పాక్ మధ్య సరిహద్దు పై చర్చల పట్ల చైనా హర్షం వ్యక్తం చేసింది. ఎంతోకాలంగా కాల్పుల మోతతో దద్దరిల్లిన భారత్-పాకిస్థాన్ సరిహద్దుల్లో ప్రస్తుతం నిశ్శబ్దం రాజ్యమేలుతోంది. కాల్పుల విరమణ పాటించాలని ఇరువర్గాలు ఏకాభిప్రాయానికి రావడమే అందుకు కారణం. భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య చురుగ్గా సాగుతున్న చర్చలు చైనాకు ఆనందం కలిగిస్తున్నాయని ఆ దేశ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఝావో లిజియాన్ వెల్లడించారు. కాల్పుల విరమణ ఒప్పందానికి కట్టుబడి ఉంటామని ఫిబ్రవరి 25న జరిగిన చర్చల్లో భారత్, పాక్ సైనిక ఉన్నతాధికారులు ఏకాభిప్రాయానికి వచ్చారు. ఎల్ఓసీ పొడవునా అన్ని ఒప్పందాలను కచ్చితంగా పాటించాలని నిర్ణయించారు. ఆ తర్వాత కొన్నిరోజులకే పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్, ఆ దేశ సైనిక జనరల్ ఖమర్ జావేద్ బజ్వా శాంతి వచనాలు పలికారు. దీంతో భారత్ పాక్ మధ్య ఇకపై శాంతి వాతావరణం నెలకొంటుందని చైనా ఆశాభావం వ్యక్తం చేసింది

Advertisement

తాజా వార్తలు

Advertisement