చైనా తన ఫ్యామిలీ ప్లానింగ్ పాలసీలో సోమవారం మరో కీలక మార్పు చేసింది. ఇక నుంచి చైనాలో జంటలు గరిష్ఠంగా ముగ్గురు పిల్లలను కూడా కనొచ్చని స్పష్టం చేసింది. దేశంలో వృద్ధుల సంఖ్య పెరిగిపోతుండటంతో అక్కడి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. సోమవారం చైనా అధ్యక్షుడు, అధికార కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా (సీపీసీ) ప్రధాన కార్యదర్శి జీ జిన్‌పింగ్ నేతృత్వంలో జరిగిన కేంద్ర కమిటీలో ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. చైనా జనాభా నిర్మాణ పద్ధతిని వృద్ధి చేయడానికి ఈ నిర్ణయం ఉపయోగపడుతుందని అక్కడి అధికార మీడియా అభిప్రాయపడింది. ఏ దేశానికైనా యువత సంఖ్య ఎక్కువగా ఉండటం అనేది ప్రధానం. ఈ ముగ్గురు పిల్లల కొత్త విధానాన్ని అన్ని స్థాయిల్లోని పార్టీ కమిటీలు, ప్రభుత్వాలు పటిష్టంగా అమలు చేయాలని నిర్ణయించారు.
కానీ చైనాలో మాత్రం వృద్ధుల సంఖ్య పెరిగిపోతోంది. దీనికి ఆ దేశం జనాభా నియంత్రణలో భాగంగా దశాబ్దాల పాటు అనుసరించిన వన్ చైల్డ్ పాలసీయే కారణం. 1970వ దశకం నుంచి 2016 వరకు ఒకే సంతానం అన్న విధానాన్ని చైనా కఠినంగా అమలు చేసింది. 2016 నుంచి ఇద్దరు పిల్లలను కనడానికి అనుమతి ఇచ్చింది. తాజాగా దీనిని ముగ్గురికి పెంచడం గమనార్హం. సోమవారం చైనా అధ్యక్షుడు, అధికార కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా (సీపీసీ) ప్రధాన కార్యదర్శి జీ జిన్‌పింగ్ నేతృత్వంలో జరిగిన కేంద్ర కమిటీలో ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు.