Saturday, November 23, 2024

చైనా వ్యాక్సిన్ పనిచేయదు, వాడకండి: అమెరికా

కొవిడ్ ను సంపూర్ణంగా నియంత్రించడంలో చైనా వ్యాక్సిన్లు విఫలమైనట్లు అనేక దేశాల నుంచి సేకరించిన డేటా ఆధారంగా తెలుస్తోందని ఇటీవల న్యూయార్క్ టైమ్స్ తన కథనంలో పేర్కొంది. చైనా టీకాలు కొత్త వేరియంట్లపై అసలు పనిచేయడం లేదని ఆ రిపోర్ట్‌లో తెలిపారు. దీంతో చైనా టీకాల సామర్థ్యంపై సందేహాలు వెల్లువెత్తుతున్నాయి. టీకాలు కరోనాని అడ్డుకుంటాయా, లేదా అంటే.. ఇప్పటికీ అది అనుమానాలను మిగిల్చే ప్రశ్నే. టీకాలు తీసుకున్నవారు కూడా తర్వాతి కాలంలో వైరస్ బారిన పడిన ఉదాహరణలున్నాయి. అలాగని వ్యాక్సిన్ ని తక్కువ అంచనా వేయకూడదు, వైరస్ దుష్పరిణామాల తీవ్ర తగ్గించేందుకు టీకా తోడ్పడుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే చైనా వ్యాక్సిన్ పై మాత్రం అమెరికా తీవ్ర సందేహాలు వ్యక్తం చేస్తోంది. చైనా టీకా వేసుకున్న దేశాల్లో కొత్తగా వెలుగు చూస్తున్న కరోనా కేసుల్ని చూపెడుతూ.. అమెరికా మీడియా వరుస కథనాలనిస్తోంది. కొత్త వేరియంట్లపై చైనా టీకా అసలు పనిచేయడంలేదని చెబుతోంది అమెరికా.

చైనాకు చెందిన సైనోఫార్మ్‌ వ్యాక్సిన్‌ 78.1 శాతం, సైనోవాక్ టీకా 51 శాతం సామర్థ్యంతో పనిచేస్తాయని అధ్యయన ఫలితాలు చెబుతున్నాయి. ఈ నమ్మకంతోటే చైనా టీకాలను సుమారు 90 దేశాలు దిగుమతి చేసుకుంటున్నాయి. ఈ టీకాలనే వాడుతున్న మంగోలియాలో గత ఆదివారం కొత్తగా 2400 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అయితే వ్యాక్సిన్లకు.. మళ్లీ కేసులు పెరగడానికి సంబంధం లేదని చైనా విదేశాంగ శాఖ తాజాగా ఓ ప్రకటనలో పేర్కొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement