ధోనీ గురించి ఎంత చెప్పినా తక్కువే.. బౌలర్ పరిస్థితిని ఎంతో బాగా అర్థం చేసుకుంటాడు. పరిస్థితి ఏదైనా.. ఎప్పుడూ తిట్టేవాడు కాదు. 2018లో దక్షిణాఫ్రికా పర్యటనలో ఉన్నాను. సఫారీలతో టీ20 మ్యాచ్ ఆడుతున్నాను. 64 పరుగులు ఇచ్చాను. హెన్రిచ్.. తన ఓవర్‌లో చాలా పరుగులు చేశాడు. ధోనీ పరిస్థితిని అర్థం చేసుకున్నాడు. వికెట్ల వెనుక ఉంటూనే.. ఎన్నో సూచనలు చేశాడు. రౌండ్ ది వికెట్ బౌలింగ్ చేయమన్నాడు. చేసినా కూడా మిడ్ వికెట్ మీదుగా ఆ బంతిని భారీ సిక్స్‌గా మలిచాడు. వేరే కెప్టెన్ ఉంటే తిట్టేవాడు. కానీ మిస్టర్ కూల్ మాత్రం అలా చేయలేదు.
ఈ రోజు నీకు కలిసి రాలేదన్నాడు. వన్డేలో బాగానే బౌలింగ్ చేశావు, నీ వంతు ప్రయత్నం చేశావు. అయినా రాణించలేకపోయావు. ప్రతీ మ్యాచ్‌లో వికెట్లు తీయాలని బౌలర్ అనుకుంటాడు.. భారీ పరుగులు చేయాలని బ్యాటర్ అనుకుంటాడు. దీని గురించి ఎక్కువ ఆలోచించకుండా.. 4 ఓవర్స్ కంప్లీట్ చేసేయ్.. అంటూ వెన్నుతట్టి ప్రోత్సహించాడు. ఇది నేను ఎప్పటికీ మరిచిపోలేను. ధోనీ నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నాను.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..