Friday, September 20, 2024

AP | మనం బతుకుతూ పది మందిని బతికించాలి: ఉప ముఖ్యమంత్రి బట్టి

చంద్రగిరి, (ప్రభ న్యూస్) చంద్రగిరి మండలం, ఏ.రంగంపేట, శ్రీసాయినాథ్ నగర్ లో ఉన్న మోహన్ బాబు విశ్వవిద్యాలయంలో ఆదివారం 13వ గ్రాడ్యుయేషన్ డే, ఎంబియు మొదటి స్నాతకోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మల్లు హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మోహన్ బాబు యూనివర్సిటీ మొదటి స్నాతకోత్సవంకు రావడం నా అదృష్టం అన్నారు.పీజీటి టీచర్ గా మోహన్ బాబు జీవితాన్ని మొదలు పెట్టి, స్వర్గం-నరకం సినిమా ద్వారా విలన్ గా సిని రంగ ప్రవేశం చేశారని,ఆ తర్వాత హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా మంచి పాత్రలలో నటించి ఎన్టీఆర్ తర్వాత అంతటి పేరుప్రఖ్యాతులు మోహన్ బాబు గడించారని ప్రశంసించారు. పట్టుదలతో ఏదైనా సాధించవచ్చని చెప్పడానికి మోహన్ బాబు జీవితం నిదర్శనం అని తెలిపారు.

- Advertisement -

సినిమా రంగంలో మోహన్ బాబు బిజీగా ఉన్నా కూడా, పూర్తి వైరుధ్యం ఉన్న విద్యా వ్యవస్థలో అడుగు పెట్టి, స్కూల్ నుంచి యూనివర్సిటీ వరకు తీసుకొచ్చి, కేవలం వ్యాపారమే కాకుండా 25శాతం ఉచిత విద్యను అందించడం మోహన్ బాబు గొప్పతనం అని కొనియాడారు.

ఎన్ని విజయాలు సాధించినా గతాన్ని మరిచిపోకూడదన్నారు.మనం బ్రతుకుతూ పది మందిని బ్రతికించడం గొప్ప విషయం అని,పోటీ ప్రపంచంలో ఎదుటి వారిని ఓడించడం కాకుండా మనసు గెలిచి అద్బుత విజయాలు సాధించాలని విద్యార్థులకు సూచించారు. గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్న విద్యార్థులకు అభినందనలు తెలియజేశారు..

.

ఈ కార్యక్రమంలో ముందుగా డా.మంచు మోహన్ బాబు మాట్లాడుతూ నా తల్లిదండ్రుల ఆశీస్సులతో విద్యాదానం, క్రమశిక్షణ, చదువు, దారితప్పిన వారిని దారిలో పెట్టేందుకు 32సంవత్సరాలు క్రితం కృషి పట్టుదలతో విద్యా వ్యవస్థలో అడుగుపెట్టడం జరిగిందని, నేడు యూనివర్సిటీ స్థాయికి చేరుకున్నామని చెప్పారు. నాకు ఆవేశం- ఎమోషన్ ఎక్కువ అన్నారు.అన్ని పార్టీలు ఇష్టపడే వ్యక్తి బట్టి విక్రమార్క మల్లు అని, ఆయనను చీఫ్ గెస్ట్ గా ఆహ్వానించామన్నారు. స్వర్గీయ ఎన్టీఆర్,స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి తర్వాత అదే స్థాయి పంచకట్టు తో కనిపించే వ్యక్తి బట్టి విక్రమార్క అనిప్రశంసించారు. గ్రాడ్యుయేషన్ పట్టాలు పొందిన విద్యార్థులకు అభినందనలు తెలియజేశారు.

శ్రీవారి సేవలో డిప్యూటీ సీఎం

ముందుగా భట్టు తిరుమల శ్రీవారిని తెలంగాణ కుటుంబ సమేతంగా ఈరోజు తెల్ల వారు జామున దర్శించు కున్నారు. దర్శనానంతరం రంగనా యకుల మండపంలో పండితులు వేద ఆశీర్వ చనం పలకగా…ఆలయ అధికారులు తీర్ధప్రసాదాలు అందజేశారు. రెండు రాష్ట్రా ల ప్రజలు పాడి పంటలతో సుభిక్షంగా ఉండాలని శ్రీవారిని ప్రార్థించినట్లు డిప్యూటీ సీఎం తెలిపార

Advertisement

తాజా వార్తలు

Advertisement