హైదరాబాద్, ఆంధ్రప్రభ : సెంట్రల్ బోర్డు నిర్వహించే సీటెట్ (కంప్యూటర్ ఆధారిత ఉపాధ్యాయ అర్హత పరీక్ష )ను ఈ ఏడాది డిసెంబర్‌లో నిర్వహించనున్నారు. పరీక్షా నిర్వహణ తేదీని తర్వాత ప్రకటిస్తామని సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ప్రకటించింది. ఆన్‌లైన్ మోడ్‌లో దాదాపు 20 దేశీయ భాషల్లో ఈ పరీక్షను నిర్వహించనున్నారు. పరీక్ష తేదీతోపాటు ఏయే పట్టణాల్లో , ఏయే కేంద్రాల్లో పరీక్ష నిర్వహించనున్నది త్వరలో బోర్డు ప్రకటించనుంది. ఈలోగా అభ్యర్థులు సీ టెట్ పరీక్షకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. బోర్డు వెబ్‌సైట్ ద్వారానే అభ్యర్థులు తమ దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుంది. దరఖాస్తుల స్క్రూట్నీ తేదీలను త్వరలో బోర్డు ప్రకటించనుంది.
ఆసక్తి ఉన్న అభ్యర్థులు బోర్డు వెబ్‌సైట్ నుంచి దరఖాస్తు చేసుకోవాలని నిర్వహకులు సూచిస్తున్నారు. ఆన్‌లైన్‌లో జాగ్రత్తగా దరఖాస్తును సమర్పించాలని అధికారులు అభ్యర్థులను కోరారు. డిసెంబర్‌లో నిర్వహించే సీ టెస్టు కోసం జనరల్/ఓబీసీ అభ్యర్థులు రెండు పేపర్లలో ఏదేకి ఒక పేపర్ పరీక్షకు హాజరు కావాలంటే రూ.1000, అదే ఎస్సీఎస్టీ, దివ్యాంగులైతే రూ.500 చెల్లించాల్సి ఉంటుంది. అదే సమయంలో రెండు పేపర్లను రాసే జనరల్, ఓబీసీ అభ్యర్థులు రూ.1200, ఎస్సీఎస్టీ, దివ్యాంగులైతే రూ.600 ను ఫీజు కింద చెల్లించాల్సి ఉంటుంది.