మెడికల్ కోర్సుల్లో రిజర్వేషన్లు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆలిండియా కోటా స్కీమ్ కింద మెడికల్, డెంటల్ గ్రాడ్యుయేట్, పోస్ట్‌గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ఓబీసీలకు 27 శాతం, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు ( EWS Reservation ) 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. ఈ రిజర్వేషన్లు ప్రస్తుత విద్యా సంవత్సరం నుంచే ఎంబీబీఎస్, ఎండీ, ఎంఎస్, బీడీఎస్, ఎండీఎస్, డిప్లొమా మెడికల్ కోర్సుల్లాంటి అన్నింటికీ వర్తిస్తాయి. దేశవ్యాప్తంగా ఉన్న ఓబీసీలు ఇక నుంచి ఈ ఆలిండియా కోటా స్కీమ్ కింద ఉన్న ఈ రిజర్వేషన్లపై ఏ రాష్ట్రంలో అయినా సీట్ల కోసం పోటీ పడవచ్చని కేంద్రం తెలిపింది.
Advertisement
తాజా వార్తలు
Advertisement