హైదరాబాద్, ఆంధ్రప్రభ : తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని పవర్ లోకి తీసుకు వచ్చేందుకు ఆ పార్టీ అధిష్టానం సీరియస్ గా దృష్టి పెట్టింది. నేరుగా ఢిల్లీ పెద్దల కనుసన్నల్లోనే రాష్ట్ర రాజకీయాలను ముందుకు తీసుకువెళ్తున్నారు. త్వరలో జరగబోయే ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో.. తెలంగాణను కూడా కీలకంగానే భావిస్తున్నారు. అందుకు కర్ణాటక ఎన్నికల తర్వాత తెలంగాణపై పుల్ ఫోకస్ పెట్టారు. దీనిలో భాగంగానే ఏఐసీసీ పరిశీలకుల నుంచి నుంచి స్కీన్రింగ్ కమిటీ వరకు అంతా రాష్ట్రాన్రికి సంబంధం లేని నేతలకు బాధ్యతలను అప్పగించారు.
దేశ వ్యాప్తంగా ఇతర రాష్ట్రాల్రకు చెందిన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్సీలకు రాష్ట్రంలోని 17 పార్లమెంట్ నియోజక వర్గాలకు పరిశీలకులుగా పార్టీ అధిష్టానం నియమించింది. వీళ్లంతా ఢిల్లీలోని ఏఐసీసీ కీలక నేతలకు సన్నిహితులే. ఈ ఏడాది జూలై14 నుంచి ఈ నేతలంతా ఆయా పార్లమెంట్ పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్ లలో పలు మార్లు పర్యటించి పార్టీకి పరిస్థితులను పరిశీలించారు.
ప్రజలతో పాటు వివిధ వర్గాల నేతలను అడిగి కాంగ్రెస్ పార్టీ గ్రౌండ్ రిపోర్టును సేకరించారు. ప్రతి పదిహేను రోజులలకోసారి ఏఐసీసీకీ నివేదికలు పంపుతున్నారు. కొంత మంది అబ్జర్వర్లు సిక్రేట్ సర్వేల్లోనూ భాగస్వామ్యమవుతున్నారు. ఇక అభ్యర్ధులు, అసెంబ్లీ నియోజక వర్గాల వారిగా పరిస్థితి, పాపులర్ సర్వేల తో పాటు ఎన్నికల సన్నద్ధంపై వ్యూహాలను కూడా మానిటరింగ్ చేస్తున్నారు.
టిక్కెట్ల పంపిణీలోనూ ఢిల్లీ పెద్దలే..
గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సారి టిక్కెట్ల పంపిణీలో కాంగ్రెస్ పార్టీ పకడ్బందీగా, కచ్చితమైన విధానంతో వ్యవహరిస్తొన్నది. టిక్కెట్ల పంపిణీలో రాష్ట్ర నేతల భాగస్వామ్యం లేకుండానే పార్టీ పూర్తి స్థాయిలో జాగ్రత్తలు తీసుకుంటున్నది. దీనిలో భాగంగానే రాహుల్, కేసీ వేణుగోపాల్ కు అతి సన్నిహితుడైన మురళీధరన్ ను స్కీన్రింగ్ కమిటీకి చైర్మన్‌గా బాధ్యతలు అప్పగించారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. గాంధీభవన్ లో అప్లికేషన్లు పరిశీలన, పార్టీ సీనియర్లు, ప్రదేశ్ ఎలక్షన్ కమిటీ అభిప్రాయాలు, దరఖాస్తుల స్కూట్ర్నీ వంటి వన్నీ మురళీధరన్ టీమ్ పరిశీలించింది.
ఆ తర్వాత ఢిల్లీకి నివేదికలు పంపించింది. తుది స్కీన్రింగ్ కమిటీ మీటింగ్ తర్వాత అభ్యర్ధులను ప్రకటించనున్నారు. అయితే రాష్ట్ర నేతలు చాలా మంది తమ అనుచరులు, సన్నిహితులు, కుటు-ంబ సభ్యులకు టిక్కెట్లు ఇవ్వాలని ఇటు స్కీన్రింగ్ కమిటీ, ఏఐసీసీ, సెంట్రల్ ఎలక్షన్ కమిటీల ముందు ప్రతిపాదనలు పెడుతూనే ఉన్నారు. వీటన్నింటినీ హైకమాండ్ సున్నితంగా తిరస్కరిస్తున్నది. సర్వేల్లో బెస్ట్ ఫర్మామెన్స్ ఉన్నోళ్లనే అభ్యర్థి గా ఎంపిక చేస్తామని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ సైతం రాష్ట్ర నేతలకు తేల్చి చెప్పారు.
ఠాక్రేకు వివరించినా… నో ఫైదా..?
కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహరాల ఇంచార్జీ మానిక్ రావు ఠాక్రే సిఫారసు చేసినా.. ఈ సారి టిక్కెట్ లభించడం కష్టమనే అభిప్రాయన్ని కొందరు నేతలు వెల్లడిస్తున్నారు. పీసీసీ అధ్యక్షుడు, సీఎల్పీ నేత, మాజీ మంత్రులు, సీనియర్లు రిఫర్ చేసినా కూడా జాతీయ కాంగ్రెస్ పార్టీ టిక్కెట్లు ఇచ్చేందుకు ఆసక్తి చూపడం లేదుని సమాచారం.
కేవలం పార్టీ నియమించిన ఎన్నికల వ్యూహకర్త సునీల్ కనుగోలు సర్వేలు, పరీశీలకులు ఇచ్చే ఫీడ్ బ్యాక్ అధిష్టానం ప్రత్యేకంగా నిర్వహిస్తున్న సర్వేలు, తదితర అంశాలను క్రోడీకరించాకనే టికెట్ల కేటాయింపు ఉంటుందని చెబుతున్నారు. అందుకు ఢిల్లీలోని హైకమాండ్ సొంతంగా పరిస్థితులను మానిటరింగ్ చేస్తున్నది. అధికారంలోకి వచ్చేందుకు నేతలంతా సహకరించాల్సిందేనని, పార్టీ నాయకులు అధిష్టానం ఇప్పటికే సూచన చేసింది.
గతంలో జరిగిన తప్పుడు నివేదికలతో అప్రమత్తం..?
2014, 2018 రాష్ట్రంలో జరిగిన ఎన్నికల సమయంలో కొంత మంది ముఖ్య లీడర్లు హైకమాండ్‌కు తప్పుడు ఫీడ్ బ్యాక్ ఇచ్చారని ఢిల్లీ నేతలు ఇటీవల పలుమార్లు అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. ముఖ్యంగా టిక్కెట్ల పంపిణీలో రాష్ట్ర నేతలు సిఫారసు చేసిన అభ్యర్థులకు గతంలో జరిగిన ఎన్నికల్లో ఆశీంచిన స్థాయిలో ప్రజల సపోర్టు లేకున్నా.. పార్టీ తరపున టిక్కెట్ ఇవ్వాల్సి వచ్చిందని జాతీయ కాంగ్రెస్ పార్టీ లో చర్చ జరిగింది.
సీడబ్ల్యూసీ సమావేశాల్లోనూ సోనియా ఈ విషయాన్ని ప్రస్తావించినట్లు తెలిసింది. దీంతో అలాంటి తప్పిదాలు లేకుండా ఢిల్లీ హైకమాండ్ అత్యంత జాగ్రత్తలతో అడుగులు వేయడం గమనార్హం. ఈ నెల 6న ఢిల్లిలో స్క్రీనింగ్ కమిటీ సమావేశం ఉంటుందని, అందులో 60 నుంచి 70 సీట్ల వరకు ఫైనల్ చేసి ప్రకటించే అవకాశం ఉందని పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.