పోలవరం, ప్రభ న్యూస్: పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులను కేంద్ర బృందం శనివారం పరిశీలించింది. ఉదయం 10 గంటలకు ప్రాజెక్టుకు చేరుకున్న కేంద్ర బృందంలో కేంద్ర జల శక్తి మంత్రిత్వ శాఖ సలహాదారు వేదిరే శ్రీరామ్, పోలవరం ప్రాజెక్టు అథారిటీ- సీఈవో జె చంద్రశేఖర్ అయ్యర్, పిపిఎ సభ్యులు ఎంకె శ్రీనివాస్, ఎం గోపాలకృష్ణ, వేకే హండా, డిపి భార్గవ్. డాక్టర్ చిత్ర, ఖయూం మహ్మద్, పి దేవేందర్ రావు, మణీష్ గుప్తా, అశ్విని కుమార్ వర్మ వున్నారు బృందం స్పిల్ వే ఛానల్, అప్రోచ్ ఛానల్ పరిశీలించారు. అక్కడి నుండి రాక్ ఫిల్ గైడ్ డామ్‌ను చూశారు.
స్పిల్ వే అప్రోచ్ చానెల్ ను,రాక్ పిల్ గైడ్ బండ్ ను, ఇ.సి.ఆర్.ఎఫ్ డ్యాం,గ్యాప్-1 గ్యాప్-2 , డయాఫ్రమ్ వాల్ ను పరిశీలించారు. ఇసుక క్వారిని, ఎగువ కాఫర్ డామ్‌ను పరిశీలించారు , దిగువ కాఫర్ డామ్‌ను, విద్యుత్ కేంద్రం చవ్వకం పనులు కూడా పరిశీలించారు. పోలవరం ప్రాజెక్ట్ మోడల్ ను చూపిస్తూ ప్రాజెక్ట్ పనులు జరుగుతున్న తీరును ఇరిగేషన్ ఇ.ఇ కె.బాలకృష్ణ మూర్తి వివరించారు.ఈ బృందం వెంట ఇరిగేషన్ ఈ.ఎన్.సి. నారాయణ రెడ్డి,జలవనరులశాఖ సలహాదారులు ఎం.వేంకటేశ్వరరావు,గిరిధర్ రెడ్డి,ప్రాజెక్ట్ సి.ఈ .డి.సుధాకర్ బాబు,ఛీఫ్‌ఇంజనీర్ క్వాలిటీ కంట్రోల్ ఆర్.సతీష్ కుమార్,ఎస్.ఈ.శ్రీనివాస్ యాదవ్,ఈ.ఈ . కె.బాలకృష్ణ మూర్తి తదితరులు ఉన్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..