సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) ఈ రోజు (సెప్టెంబర్ 17) సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (CET)-డిసెంబర్ 2024కి సంబంధించిన నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఉపాధ్యాయ వృత్తిని ఎంచుకునే వారి సామర్థ్యాన్ని అంచనా వేయడానికి CBSE జాతీయ స్థాయిలో సంవత్సరానికి రెండుసార్లు ఈ పరీక్షను నిర్వహిస్తుంది.
అర్హులైన అభ్యర్థులు అక్టోబర్ 10 వరకు దరఖాస్తులను సమర్పించవచ్చు. అభ్యర్థులు ఒక పేపర్‌కు రూ.1000 (ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీలకు రూ.500), రెండు పేపర్లకు రూ.1200 (ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీలకు రూ.600) దరఖాస్తు రుసుముగా చెల్లించాలి.
దేశవ్యాప్తంగా 136 నగరాల్లో డిసెంబర్ 1న CTET పరీక్ష నిర్వహించనున్నారు. కాగా, ఆన్లైన్లో జరిగే ఈ పరీక్ష పేపర్-1 – మధ్యాహ్నం 2.30 – సాయంత్రం 5 గంటల వరకు…. పేపర్-2 – ఉదయం 9.30 – మధ్యాహ్నం 12 గంటల వరకు జరుగుతుంది