ఈ రోజు మోదీ తో పాటు మరో 71 మంది మంత్రులుగా పదవీ ప్రమాణం చేసారు. వారిలో 61 మంది బీజేపీ కి చెందిన వారు కాగా మిగిలిన 11 మంది ఎన్డీఏ మిత్ర పక్షాలకు చెందిన వారు.
ఈ రోజు ప్రమాణం చేసిన వారిలో 30 మంది కేబినెట్ మినిస్టర్ లు కాగా, ఐదుగురు స్వతంత్ర మంత్రులు, 36 మంది సహాయ మంత్రులు ఉన్నారు .
పలువురు బీజేపీ అగ్ర నేతలకు మళ్లీ చోటుగతంలో కీలక శాఖలు నిర్వహించిన బీజేపీ అగ్ర నేతలు అమిత్ షా, రాజ్‌నాథ్‌సింగ్, పియూష్‌గోయెల్, నిర్మలాసీతారామన్, నితిన్ గడ్కరీ జితేంద్ర సింగ్ కేబినెట్ మంత్రులుగా మూడోసారి ప్రమాణం చేశారు. బీజేపీ నేషనల్ చీఫ్ జేపీ నడ్డాను ఈసారి కేంద్ర మంత్రి వర్గంలోకి తీసుకున్నారు.
తెలుగు రాష్ట్రాల నుంచి ఐదుగురికి పదవులుతెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ నుంచి నరసాపురం ఎంపీగా గెలుపొందిన బీజేపీ నేత శ్రీనివాస వర్మ, తెలంగాణ నుంచి కిషన్‌రెడ్డి, బండి సంజయ్ కేంద్ర మంత్రులుగా ప్రమాణం చేశారు. ఎన్డీఏ ప్రభుత్వంలో కీలక భాగస్వామిగా ఉన్న తెలుగు దేశం పార్టీ తరపున కింజారపు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్‌కు మంత్రి వర్గంలో చోటు దక్కింది.
మోదీ 3.0.. ఏ రాష్ట్రానికి ఎన్ని బెర్తులు..
యూపీ నుంచి 9 మందికి కేంద్ర మంత్రి పదవులు దక్కగా, మహారాష్ట్ర నుంచి ఆరుగురుకి కేంద్రమంత్రి పదవులు దక్కాయి. ఇక గుజరాత్ నుంచి ఐదుగురు, కర్ణాటక నుంచి ఐదుగురు, ఒడిశా నుంచి ముగ్గురు చోటు దక్కించుకున్నారు. మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లకు నాలుగు చొప్పున మంత్రి పదవులు, జార్ఖండ్ ,బెంగాల్ నుంచి ఇద్దరికి చొప్పున మంత్రి పదవులు, కేరళ, తమిళనాడు, పంజాబ్, జమ్మూ కాశ్మీర్, అరుణాచల్ ప్రదేశ్, ఢిల్లీ, ఉత్తరాఖండ్‌లకు ఒక్కో మంత్రి పదవి దక్కింది