Monday, November 18, 2024

Riots – మణిపూర్‌లో కేంద్ర మంత్రి ఇంటిపై పెట్రో బాంబులతో దాడి

మణిపూర్‌లో అల్లర్లు కొనసాగుతున్నాయి. రెండు తెగల మధ్య ఘర్షణలతో ఈశాన్య రాష్ట్రం రావణకాష్టంలా తయారైంది. బుధవారం ఓ మహిళా మంత్రి ఇంటికి నిప్పుపెట్టిన ఆందోళనకారులు.. తాజాగా కేంద్ర మంత్రి ఆర్కే రంజన్‌ సింగ్‌ ఇంటిపై దాడిచేశారు ఇంఫాల్‌లో కర్ఫూ విధించడానికి నిరసిస్తూ.. గురువారం రాత్రి కోంగ్బా ప్రాంతంలో ఉన్న మంత్రి నివాసాన్ని సుమారు 1200 మంది ఆందోళనకారులు చుట్టుముట్టారు. ఇంటిపై పెట్రో బాంబులు విసిరారు. దీంతో ఇళ్లు కాలిపోయింది. అయితే ఆ సమయంలో మంత్రి ఇంట్లో లేరని పోలీసులు వెల్లడించారు

మంత్రి ఇంటిపై దాడి జరగడం ఇది రెండో సారి. గత నెలలో కూడా ఆందోళనకారులు చుట్టుముట్టగా.. భద్రతా సిబ్బంది గాలిలోకి కాల్పులు జరిపి చెదరగొట్టారు. అయితే రాత్రి జరిగిన దాడిని మాత్రం అడ్డుకోలేకపోయామని ఎస్కార్ట్‌ కమాండర్‌ దినేశ్వర్‌ సింగ్‌ చెప్పారు. రాత్రి పొద్దుపోయిన తర్వాత సుమారు 1200 మంది మంత్రి ఇంటిని చుట్టుముట్టారని, అన్ని వైపుల నుంచి పెట్రోల్‌ బాంబులు విసిరారని తెలిపారు. ఆ సమయంలో ఐదుగురు సెక్కూరిటీ గార్డులు, తొమ్మిది మంది భద్రత సిబ్బంది, మరో ఎనిమిదిమంది అదనపు సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారని వెల్లడించారు

Advertisement

తాజా వార్తలు

Advertisement