- నివేదిక ఇవ్వాలని టీటీడీకి ఆదేశాలు
- తిరుమల పర్యటనకు హోంశాఖ అదనపు కార్యదర్శి
తిరుమలలో జరిగిన వరుస ప్రమాదాలపై కేంద్ర హోంశాఖ సీరియస్ అయింది. క్యూ లైన్లో తొక్కిసలాట, లడ్డూ కౌంటర్‌లో మంటలు చెలరేగిన ఘటనలపై నివేదిక ఇవ్వాలని టీటీడీని కేంద్ర హోంశాఖ ఆదేశించింది. కేంద్ర హోంశాఖ అదనపు కార్యదర్శి సంజీవ్ కుమార్ జిందాల్ రేపు, ఎల్లుండి రెండు రోజుల పాటు తిరుమలలో పర్యటించనున్నారు.
ఈ సందర్భంగా అధికారులతో సమావేశమై ఇటీవల జరిగిన ఘటనలపై ఆరా తీస్తారు. అయితే కేంద్రం ఇలా జోక్యం చేసుకోవడం టీటీడీ చరిత్రలో ఇదే తొలిసారి.