కరోనా సోకినా భయపడాల్సిన అవసరం లేదన్నారు కేంద్ర ఆరోగ్యశాఖ జాయింట్ కార్యదర్శి లవ్ అగర్వాల్. చాలా మంది భయాందోళనలతో ఆస్పత్రుల్లో చేరుతున్నారు. కాని కొవిడ్ బాధితులు వైద్యుల సలహా మేరకే ఆస్పత్రుల్లో చేరాలని ఆయన సూచించారు. హోంఐసోలేషన్ కేసులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని రాష్ట్రాలను కోరారు. అంతేకాదు కరోనా బాధితులు తప్పనిసరిగా భౌతికదూరం, మాస్క్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలన్నారు. భౌతికదూరం పాటించని రోగి నుంచి నెలరోజుల్లో 406 మందికి వైరస్ వ్యాప్తి చెందుతోంది. ఇంట్లోనూ మాస్కులు ధరించాల్సిన సమయం వచ్చిందిని ఆయన తెలిపారు.
ఇక మహారాష్ట్ర, యూపీ, కర్ణాటక, గుజరాత్, తమిళనాడు, కేరళ, రాజస్థాన్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లోనే లక్షకు పైగా యాక్టివ్ కేసులున్నాయని లవ్ అగర్వాల్ తెలిపారు. మహిళలు నెలసరిరోజుల్లోనూ టీకా తీసుకోవచ్చు’’ అని లవ్ అగర్వాల్ తెలిపారు. దేశంలో కరోనా రోగుల రికవరీ రేటు 82 శాతానికి తగ్గిందని వెల్లడించారు.