కరోనా మహమ్మారి ప్రభావంతో వేల సంఖ్యలో కార్మికులు, ఉద్యోగులు తమ కొలువులు కోల్పోయారు. అటువంటి వారికి ఉపాధి అవకాశాలు పెంచడం కోసం కేంద్ర ప్రభుత్వం ముందుకు వచ్చింది. గతేడాది అక్టోబర్‌లో ఉపాధి కల్పనలో స్వయం సమ్రుద్ధి (ఆత్మ నిర్బన్ భారత్ రోజ్‌గార్ యోజన -ఏబీఆర్‌వై) ప్రారంభించింది. గతేడాది అక్టోబర్ నుంచి 2022 మార్చి నెలాఖరు వరకు ఈ స్కీమ్ ప్రయోజనాలు పొందవచ్చు. 21 లక్షల మందికి పైగా యువతకు దీనివల్ల బెనిఫిట్ లభించింది. ప్రభుత్వ ఖజానాపై రూ.22,810 కోట్ల భారం పడుతుందని అంచనా.
ఉద్యోగ భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్‌వో)లో పేర్లు నమోదు చేసుకున్న సంస్థలకు మాత్రమే ఈ స్కీమ్‌లో చేరేందుకు అనుమతి ఉన్నది. నూతన ఉద్యోగులు లేదా కార్మికులకు ఫ్రావిడెండ్ ఫండ్ ఖాతాల్లో మొత్తం 24 శాతం వేతనాన్ని జమ చేస్తుంది. ఏబీఆర్‌వై పథకం కింద రూ.902 కోట్లు ఖర్చు చేశామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గతవారం చెప్పారు. దీనివల్ల 21.42 లక్షల మందికి ప్రయోజనం ఒనకూడింది. లబ్ధి దారులంతా 79,577 కంపెనీల్లో సభ్యులుగా ఉన్నారు. తొలుత గత నెల 30 వరకు మాత్రమే అమలులో ఉన్న ఈ పథకం 2022 మార్చి 31 వరకు పొడిగించినట్లు తెలిపారు. కరోనా నేపథ్యంలో ఉద్యోగాల కల్పనను వేగవంతం చేసి ఉద్యోగులకు రిలీఫ్ కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంది. అందులో ఏబీఆర్‌వై ఒకటి. 2020-23 వరకు ఈ పథకం అమలుకు రూ.22,810 కోట్లు ఖర్చు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది.
ఇది కూడా చదవండి: యాంటీ బయాటిక్ మందులను అతిగా వాడేసిన భారతీయులు