దేశ వ్యాప్తంగా మహిళలకు కేంద్రం గుడ్‌న్యూస్ చెప్పింది. స్వశక్తి సంఘాల్లో సభ్యులుగా ఉన్న మహిళలకు ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. కరోనా బారిన పడి చనిపోతున్న కుటుంబాలకు ఆర్థికంగా సాయం చేయాలని ఈ నిర్ణయం తీసుకుంది. స్వశక్తి సంఘాల సభ్యులతో పాటు జీవిత భాగస్వాములకు ఇన్సూరెన్స్ వర్తింపచేసేలా ప్రధాని సురేఖ బీమా యోజన( పీఎంఎస్‌బీవై)లో చేర్పించాలని రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇందులో మహిళా సంఘాల సభ్యులందరూ ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించింది.
కాగా ప్రీమియంను మహిళలు తీసుకునే వడ్డీ లేని రుణాల నుంచి లేదా గ్రూపులోని కార్పస్ ఫండ్ ఇన్సూరెన్స్ ప్రీమియం రూ.350 చెల్లించాలని పేర్కొంది. ప్రీమియం చెల్లించిన సభ్యులు ఏదైనా కారణంతో దురదృష్టవశాత్తూ చనిపోతే వారి కుటుంబానికి రూ.2 లక్షల సాయం అందించనున్నారు. కాగా తెలంగాణలో పీఎంఎస్‌బీవై పథకం కింద 41.16 లక్షల మందిని చేర్పించాలని రాష్ట్ర అధికారులకు కేంద్రం సూచించింది.
ఈ వార్త కూడా చదవండి: హైదరాబాద్‌లో 45 నిమిషాల పాటు ఉచిత వైఫై సేవలు